వచ్చే సంక్రాంతికి థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొననుంది. అటు లోగిళ్లలో సంక్రాంతి పండగ జరుపుకుంటుంటే, ఇటు థియేటర్లలో సినిమా పండగ జరుపుకుంటారు. తెలుగు సినిమాలకి సంక్రాంతి చాలా పెద్ద బిజినెస్ సీజన్. అందుకే పెద్ద సినిమాలన్నింటినీ సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తుంటారు. వచ్చే సంక్రాంతికి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ బన్నీ నటించిన "అల వైకుంఠపురములో" థియేటర్ల లో సందడి చేయనుంది.

 

దీనికి తోడు వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న చిత్రం వెంకీమామా తో పాటు తమిళ చిత్రం అయిన దర్బార్ కూడా వస్తుంది. అయితే ఈ చిత్రాలన్నీ పెద్ద చిత్రాలే కావడం విశేషం. ఈ సినిమాలన్నింటికీ విపరీతమైన బజ్ ఉంది. అనువాద చిత్రమైన దర్బార్ ని మినహాయిస్తే మహేష్, బన్నీ చిత్రాల మధ్య విపరితమైన పోటీ ఉండనుంది. అటు వెంకీ మామా సినిమా కోసం కూడా జనాలు ఎదురుచూస్తున్నారు.

 

అయితే ఇంతటి పోటీలో ఒక చిన్న చిత్రం సంక్రాంతి కానుకగా బరిలో దిగనుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం " ఎంత మంచి వాడవురా". మెహ్రీన్ కథానాయికగా వస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఇన్ని పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

అయితే గతంలో సతిష్ వేగేశ్న దర్శకత్వం వహించిన "శతమానం భవతి" సంక్రాంతి కానుకగ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాపై నమ్మకం పెంచుకున్నారని తెలుస్తుంది. అంతే గాక సినిమా కథ పట్ల హీరో కళ్యాణ్  రామ్ పూర్తి భరోసాతో ఉన్నాడు. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ పనులని త్వరగా పుర్తి చేస్తున్నారట. జనవరి 15 న విడుదల అవుతున్న అవుతున్న ఈ చిత్రం వారి అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: