తమ ఫేవరెట్‌ స్టార్స్‌ కోసం అభిమానులు పిచ్చి పనులు చేసి విమర్శలకు కారణం అవుతారు. అలాంటి ఓ పిచ్చి పనే చేశాడు ఓ టాలీవుడ్ హీరో అభిమాని. ఇటీవల యువ సామ్రాట్‌ నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని సాహసం చేశాడు. మోకాళ్ల మీద సింహాచలం ఆలయ మెట్లు ఎక్కాడు ఆ అభిమాని. నవంబర్‌ 23న చైతూ పుట్టిన రోజు సందర్భంగా సినీ తారలు, అభిమానులు రకరకాలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే బొబ్బిలికి చెందిన సాగర్‌ అనే ఓ అభిమాని మాత్రం తన అభిమాన హీరో కోసం సింహాచలం కొండను మోకాళ్ల మీద ఎక్కాడు. అలా ఎక్కుతుండగా తీసిన వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు సాగర్‌.

 

హీరోలకు ప్రధాన బలం వారి అభిమానులే. హీరో సినిమాల రిలీజ్‌ సమయంలో సందడంతా అభిమానులదే ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ అభిమానుల చర్యలు కాస్త శృతిమించుతుంటాయి. గతంలోనూ వారి స్టార్ హీరోల కోసం పిచ్చి పనులు చేసిన వారు ఉన్నారు. 
ఈ అభిమాని ప్రేమకు ముగ్దుడయ్యాడు చై...  

 


ఆ అభిమాని చూపించిన ప్రేమకు చైతూ కరిగిపోయాడు. `సాగర్‌.. ఏం చెప్పాలో అర్థం కావటంలేదు. మాటలు రావటం లేదు. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమకు కృతజ్ఞతలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నేను మరింత గొప్ప పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది` అంటూ రిప్లై ఇచ్చాడు. సాగర్ ట్వీ్ట్‌పై సమంత కూడా స్పందించింది. `మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. నేను నమ్మలేకపోతున్నా. మాటలు రావటం లేదు. మమ్మల్ని కలవండి` అంటూ రిప్లై ఇచ్చింది.

 

అయితే సాగర్‌ చేసిన పనిపై అక్కినేని అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం చీవాట్లు పెడుతున్నారు. ఇదే పని మీ అమ్మానాన్నల పుట్టిన రోజున చేసుంటే బాగుండేది అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా, ముందు నువ్వు నీ ఆరోగ్యం చూసుకో అంటూ మరొ వ్యక్తి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంత గొప్ప ప్రయత్నం నీ ఉద్యోగంలో చేస్తే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. నీ అభిమాన హీరో బాగానే ఉంటాడు నువ్వే మోకాళ్ల నొప్పులతో చస్తావ్ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: