తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బిగ్ బాస్ 3 రియాల్టీ షో ద్వారా ఎంతో సుపరిచితుడు అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. దాదాపు 105 రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వరుణ్ సందేశ్ టాప్ ఫైవ్ లో చేరి చాలా జెన్యూన్ గా గేమ్ ఆడుతూ కూల్ మ్యాన్ గా ఉంటూ ఇంటిలో గొడవలు జరిగిన సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ప్రస్తుతం బయట బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చా అద్భుతమైన ఆఫర్లు బెనిఫిట్ లు పొందుతున్నాడు.

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో కుర్ర హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వరుణ్ సందేశ్ తనకంటూ సెపరేట్ క్రేజీ ఏర్పరుచుకున్నాడు. కొత్త బంగారు లోకం తో తెలుగు యువత ను ఎంతగానో ఆకర్షించిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ కావడంతో కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ రావడంతో 2015లో లవకుశ సినిమా తర్వాత మరొక సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు వరుణ్ సందేశ్. ఇటువంటి నేపథ్యంలో సీజన్-3 బిగ్ బాస్ హౌస్ లో కపుల్స్ గా అడుగుపెట్టిన..వరుణ్ సందేశ్- వితిక జంట లకు మంచి పేరు వచ్చింది.

 

అయితే టాప్ ఫైవ్ లోకి వెళ్లిన వరుణ్ సందేశ్ టైటిల్ గెలవలేక పోయినా ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వరుణ్ సందేశ్ కి సినిమా ఆఫర్లు వరుసబెట్టి వస్తున్నట్లు ఇప్పటికే రెండు సినిమాలు ఒకే అన్నట్లు వాటిలో ఒకటి మల్టీస్టారర్ సినిమా కాగా మరొకటి సోలో సినిమా అన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మరి ఒప్పుకున్న సినిమాలు వరుణ్ సందేశ్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: