ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఫుల్ బిజీగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలలో రాజకీయాల్లో మునిగి తేలిన బాలయ్యబాబు కొంత సమయం తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు 2 పరాజయం పాలైన తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ అనే సినిమా స్టార్ట్ చేశారు. సి.కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతున్న తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన బాలయ్య బాబు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

 

ముఖ్యంగా రూలర్ గెటప్ లో సరికొత్త రూపంలో బాలయ్య బాబు కనిపించడంతో నందమూరి అభిమానులు బాలయ్య లుక్ పై తెగ మురిసిపోతున్నారు. అదరగొట్టే గెటప్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా బాలకృష్ణ రూలర్ లో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అభిమానులు అంచనాలు చాలానే పెట్టుకున్నారు. తాజాగా బయటకు వచ్చిన లుక్ లో ఫ్రెంచ్ గడ్డంతో ... మునుపటిలా కాకుండా కొద్దగా సన్నబడి యువకుడిగా కనిపిస్తున్నారు. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది.  ఇక, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

డిసెంబర్ 15 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ప్రభాస్ ‘సాహో’, మెగాస్టార్ ‘సైరా’ సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను ఎలా నిర్వహించారో అదే రేంజ్ లో రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20 తారీఖున సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: