ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై యాంకరింగ్ తో పాటు అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు సాగుతోంది యువ యాంకర్ శ్రీముఖి. మొదట అక్కడక్కడా కొన్ని టివి షోల్లో సందడి చేసిన శ్రీముఖి, అదే సమయంలో కొన్ని సినిమా అవకాశాలు రావడంతో వాటిలో కూడా నటించింది. అయితే కెరీర్ పరంగా మాత్రం ఆమెకు బాగా గుర్తింపుని తెచ్చిపెట్టింది మాత్రం ఈటివి ప్లస్ అనే ఛానల్ లో ప్రసారం అయిన పటాస్ షో అనే చెప్పాలి. ఆ షోలో యాంకర్ రవితో కలిసి ఎన్నో ఎపిసోడ్స్ చేసిన శ్రీముఖికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

 

ఇకపోతే ఆ షోలో పార్టిసిపెంట్స్ తో కలిసి శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఎంతో చలాకిగా ఆ షోలో పెర్ఫర్మ్ చేసిన శ్రీముఖి, ఇటీవల బిగ్ బాస్ షోలో పాల్గొనే నిమిత్తం దానిని నుండి అర్ధాంతరంగా బయటకు రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి, మరింత మంచి పేరు గడించడంతో పాటు ప్రేక్షకుల్లో తనకంటూ ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ఇకపోతే ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ చేసి వచ్చిన శ్రీముఖిని స్టార్ మా ఛానల్ వారు త్వరలో ప్రారంభించబోయే ఒక షోకు యాంకర్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

'మ్యూజిక్ రీలోడెడ్' అనే ఓ కార్యక్రమం కోసం ఆమెతో ఓ సాంగ్ పాడించారు సదరు ఛానల్ వారు. పాట పాడటమే కాకుండా ఆ పాటకు ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వేసి తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది శ్రీముఖి. శ్రీముఖిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఇప్పుడూ అందరూ ఆశ్చర్యపోతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె ఆడి పాడిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్ వేయండి మరి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: