తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో గత కొద్దేళ్ళలో అత్యంత సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న కామెడీ షో ఏదైనా ఉంది అంటే అది ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' మరియు 'ఎక్స్ట్రా జబర్దస్త్'. బుల్లితెర కామెడీ వారిని సినిమాలలో పెద్దపెద్ద నటులుగా మరియు కొందర్నైతే హీరోలుగా తీర్చిదిద్దిన కామెడీ షో జబర్దస్త్ కు మొదటినుంచి మెగా బ్రదర్ నాగబాబు మరియు సినీనటి ఎమ్మెల్యే అయినా రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే అకస్తాత్తుగా నాగబాబు షో నుండి తప్పుకోవడం ఈ మధ్య చర్చనీయాంశంగా మారగా అతను కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న మాట వాస్తవమేనని ధృవీకరించాడు.

 

వెంటనే తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా ఆ షో వల్ల తనకు కలిగిన ప్రయోజనం మరియు తనకు ఉన్న బాండింగ్ గురించి మాట్లాడిన నాగబాబు దాని నుంచి బయటికి రావడానికి నిర్దిష్టమైన కారణాలు తర్వాత చెప్తా అన్నాడు. ఇలా చెప్పి తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు నాగబాబు. అది దాదాపు పది నిమిషాల నిడివి ఉంది. తన ఎగ్జిట్ వెనుక అసలు కారణాలేంటో నాగబాబు ఈ వీడియోలో చెబుతాడేమో అని జనాలు ఆసక్తిగా చూస్తే.. అందులో ఆ విషయమే లేదు. తన జబ్దర్దస్త్ ప్రయాణం ఎలా మొదలైందో.. నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ముందు 'జబర్దస్త్'ను 25 ఎపిసోడ్లు మాత్రమే నడిపించనున్నట్లు చెప్పి తనను తీసుకున్నారన్నాడు. షో మొదలయ్యాక ఎలా ఆదరణ పొందింది.. అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసింది.. వాళ్లు ఎలా ప్రతిభ చాటుకుంది.. ఎలా ఎదిగింది.. వివిధ టీంల నుంచి కొత్త లీడర్లు ఎలా వచ్చింది తాపీగా చెప్పుకుంటూ వచ్చాడు నాగబాబు.


ఇలా సాగదీస్తూ.... జనాలకి ఇవన్నీ ఏ మాత్రం ఆసక్తి కలిగిస్తాయి అన్న విషయం కూడా ఆలోచించకుండా అవసరంలేని వివరణలు ఇస్తూ వెళుతూ అసలు విషయానికి రాకుండా సుత్తి కొట్టారు నాగబాబు. తను వచ్చేయడానికి కీలకంగా ఉన్న జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భారత్ గురించి మాత్రమే చెప్పిన నాగబాబు తర్వాతి భాగంలో దీని గురించి మిగిలిన విషయాలను వివరిస్తానని ముగించాడు. చూస్తుంటే నాగబాబు ఇదేదో సీరియల్ లాగా ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు నడిపించేలా ఉన్నాడు. వీరితో బయట జనాలు నాగబాబు పెడుతున్నాడురా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: