తెలుగు టెలివిజన్ పరిశ్రమ లో నెంబర్ వన్ రియాలిటీ షో అయిన 'బిగ్ బాస్' ద్వారా వచ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భారీ మొత్తంతో పాటు బోలెడంత పేరు కూడా వస్తుంది. అయితే వారిలో కొంతమంది ముందే ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వ్యక్తులు అయినా అక్కడికి వెళ్ళాక వారికున్న పేరు, ఫేమ్ డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన పేరు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక తప్పు చేయగానే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలా చేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకరు తెలుగు చలనచిత్ర హీరో ప్రిన్స్ సుశాంత్. 

 

గుర్తుకు వచ్చాడా...? లవర్ బాయ్ గా బిగ్ బాస్ మొదటి సీజన్లో అందరినీ అలరించిన హీరో ప్రిన్స్ ఈరోజు కూకట్ పల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరయ్యాడు. ప్రిన్స్ ఈనెల 24వ తేదీన బాచుపల్లిలోని వి.ఎం.ఆర్ కాలేజ్ చెక్ పాయింట్ దగ్గర తాగి తన కారు ను నడుపుతూ మాములు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులో పట్టుబడ్డాడు.

 

ప్రిన్స్ బ్లడ్ ఆల్కహాల్ లెవల్ ఉండాల్సిన పరిమితికి మించడం తో పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. డ్రింక్ డ్రైవింగ్ లా ప్రకారం బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ సాధారణ పరిమితి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మైక్రోగ్రాముల ఆల్కహాల్ కాగా ప్రిన్స్ యొక్క బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లెవెల్ దీనిని మించి ఉంది.

 

దీంతో కూకట్ పల్లి స్పెషల్ కోర్టు జడ్జి చేసిన తప్పుగా నేను అతనికి జరిమానా విధించాడు. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులను పునరావృతం చేయకూడదని మందలించాడు. ప్రిన్స్ కూడా తను చేసిన తప్పును ఒప్పుకుని దీనిని మరలా ఎప్పుడూ రిపీట్ చేయను అని చెప్పి వచ్చేశాడు. ఎంతైనా సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: