మన సంస్కృతి, సంప్రదాయాలు..పద్దతులు, విలువలు.. విపరీతంగా పాటించే భారతీయులకు బాగా ఇష్టమైన నటి ఎవరు అని అడిగితే చాలామంది ఏ బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ పేరో చెప్తారు. కానీ ఆ మాట పచ్చి అబద్దం. అది కేవలం పైకి చెప్పే మాట మాత్రమే. కానీ అసలు నిజం మాత్రం గూగుల్ సర్వే ట్రెండ్స్ చెప్తాయి. వరసగా కొన్నేళ్లు 'సన్నీ లియోన్' ఆ సెర్చ్ ట్రెండ్స్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది. అంటే దాదాపుగా అందరూ సన్నీకి అభిమానులే! పోర్న్ ఇండస్ట్రీ కెరీర్ పక్కన పెట్టేసి సన్నీ ప్రస్తుతం సినిమా నటిగానే కొనసాగుతోంది. హిందీలోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేస్తోంది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో ఐటం సాంగ్స్ లో మెరుస్తోంది.

 

ఇక సన్నీ ఇంటర్నేషనల్ బ్యూటీ కాబట్టి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం సన్నీ దుబాయిలో ఉంది. దుబాయ్ లో జరుగుతున్న లివి ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు సన్నీ లియోన్ దుబాయ్ లో దిగింది. ఫ్యాషన్ వీక్ కార్యక్రమాల్లో గ్యాప్ దొరికినప్పుడు ఈతకొలనులో జలకాలాడి కాస్త రిలాక్స్ అయింది. అందు కోసం ఒక పూల బికినీ ధరించి మూడు నాలుగు ఫోటోలు తీయించుకొని...వాటిలో ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "లవ్ దుబాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ బికిని ఫొటో లో గ్లాంస్ ఏమాత్రం తగ్గకుండా ఇరవై నుంచి అరవై వరకు అందరు అల్లాడిపోయోలా ఫోజిచ్చింది. ఇలాంటివే కదా సంస్కృతి, సంప్రదాయాలు పద్దతులు, విలువలు..పాటించే వాళ్ళకు కావాల్సింది.

 

అందుకే ఈ ఫోటో కు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "లక్కీ బికినీ".. "స్పైసీ ఫ్లవర్ బికినీ".. "బెస్ట్ బికిని షేప్" అంటూ కొందరు సన్నీ పై పొగడ్తలు కురిపించారు. ఇక సన్నీ లియోన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళం లో 'వీరమాదేవి'.. హిందీలో 'కోకా కోలా' అనే సినిమాల్లో నటిస్తోంది. కానీ కొంతమంది మంది మాత్రం సన్నీ బ్యాక్ పోర్ణ్ అయితే బావుండు అని నోటివెంట చొంగ కార్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: