నటసింహా నందమూరి బాలకృష్ణ హీరో గా యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఎన్.బి.కె 106 ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లేందుకు బోయపాటి అన్ని పనుల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య కు జోడీ గా ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేశాడని సమాచారం. ఇక బాలయ్య ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ ని ఒప్పించాడట. బోయపాటి మార్క్ మాస్ స్టోరీకి తగ్గట్టే.. ఈ సినిమాలో హీరోయిజం... మాస్ విలనిజం హై రేంజ్ లో చూపించబోతున్నాడట బోయపాటి.


 
అయితే రియల్ లైఫ్ ఇమేజ్ ఒక్కోసారి ఊహించని అవకాశాల్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ వేపథ్యంలోనే తాజాగా వైకాపా నాయకురాలు.. ఫైర్ బ్రాండ్ రోజా కు బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ దక్కింద తాజా సమాచారం. అంతేకాదు ఆ రోల్ గురించిన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఈ సినిమాలో దత్ ఒక్కడే విలన్ కాదు. ఇందులో లేడీ విలన్ పాత్ర కూడా సినిమాలో ఉత్కంఠ పెంచేస్తుందట. ఆ రోల్ కోసం వైకాపా నేత.. ఫైర్ బ్రాండ్ రోజాని రంగంలోకి దింపబోతున్నారట. రీసెంట్‌గా బోయపాటి.. రోజాని కలిసి రోల్ గురించి చెప్పాడట. అయితే రోజా మాత్రం ఇంకా ఏ విషయం తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టారట. 

 

ఏపీలో వైకాపా అధికారంలోకి రావడానికి మహిళా నాయకురాలు రోజా ఎంతగానో శ్రమించారు. అందుకు ప్రతిగా తన హార్డ్ వర్క్ ని గుర్తించి పార్టీ ఏపీ ఐఐసీ చైర్మెన్ గా అవకాశం కల్పించింది. ఆ క్రమంలోనే పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వడం తో సినిమాలకు దూరమయ్యారు రోజా. కేవలం బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి జడ్జిగా కొనసాగుతున్నారు. బాలయ్య- బోయపాటి ఆఫర్ కు రోజా ఎస్ చెబుతారా లేదా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ సరసన రోజా గతంలో చాలానే విజయవంతమైన సినిమాల్లో నాయికగా నటించారు. అయితే ఈ సినిమాలో రోజా బాలయ్యకి సవాల్ విసిరే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: