టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఓ వైపు మహేష్ బాబు, మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా మంచి హిట్స్ తో ఊపు మీద ఉండడంతో పాటు, ఈ సినిమా ద్వారా మహేష్ బాబు లోని మంచి కామెడీ మరియు మాస్ యాంగిల్స్ ని చూపించబోతున్నట్లు ఇటీవల టీజర్ ద్వారా సినిమా యూనిట్ చిన్న హింట్ ఇచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా అద్భుతంగా ఉండడంతో, సినిమాపై అంచనాలు మరింతగా తారా స్థాయికి చేరాయి. 
 
 
మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫొటోగ్రాఫీని మరియు తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ళ తరువాత ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి రాబోయే సోమవారం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని సరిలేరు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటనని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియచేసింది. అంతేకాక #MassMBMondays అనే ఒక హ్యాష్ ట్యాగ్ ని జోడించి ఆ పోస్ట్ చేయడంతో, 
 
 
ఈ పోస్ట్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే క్యాలిక్యులేషన్స్ చేయడం మొదలెట్టేశారు. ఈ డిసెంబర్ లో మొత్తం ఐదు సోమవారాలు ఉండగా, దానిని బట్టి మొత్తం సినిమాలో ఐదు పాటలను ప్రతి ఒక్క సోమవారం సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్ విడుదల చేయబోతున్నట్లు మహేష్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా వేదికల ద్వారా కామెంట్స్ చేయడం మొదలెట్టేసారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ గెస్సింగ్ ప్రకారం దాదాపుగా ఇదే నిజం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కొందరు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో సంతోషం మరింతగా పెరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: