తెలుగు సినిమా డైరెక్టర్స్ తమ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఒకరిద్దరు పేరున్న నటులను పెట్టుకుని మిగతా పాత్రలను చోటామోటా నటులతో నింపేస్తూ ఉంటారు. ఇందులో బోయపాటి కింగ్ అని చెప్పాలి. తన సినిమాలో ఎక్కువగా ఫీ మేల్ ఆర్టిస్టులుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వాళ్ళలో కాస్త తెలిసిన మొహాలే గాని అంత ఫేమస్ సీనియర్ ఆర్టిస్టులుండరు. కానీ మన మాటల మాంత్రీకుడు అలా కాదు. అదె ఈ ఇద్దరి టాప్ డైరెక్టర్స్ కి ఉన్న తేడా. అయితే దర్శకరచయిత త్రివిక్రమ్ మాత్రం అందుకు భిన్నం. తన సినిమా నిండా పేరున్న ఆర్టిస్టులను పెట్టుకోవడానికే ఈయన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన ముందు నుంచి అంతే. ఆయన రాసే కథలో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో..ఆ పాత్రలకు ఎంచుకునే నటీ నటులు కూడా అంత పేరున్న వాళ్ళని ఎంచుకుంటారు. 

 

'సన్నాఫ్ సత్యమూర్తి' నుంచి ఈ ఫార్ములా ఇంకా ఎక్కువైంది! ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలకే పెద్ద వాళ్లను తెచ్చుకున్నారు త్రివిక్రమ్. ఉపేంద్రలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. స్నేహానూ చూపించాడు.. రాజేంద్ర ప్రసాద్ అందరికంటే స్పెషల్. ఆ తర్వాత కథలో పాత్రలో అంతగా ప్రాధాన్యత లేని పాత్రకే నిత్యామీనన్ ను ఒప్పించాడు! ఇది నిజంగా మిరాకిల్. ఎందుకంటే నిత్యా అంత త్వరగా చిన్న పాత్రలకు, ఇంపార్టెన్స్ లేని పాత్రలకు ఎస్ చెప్పదన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు మన మాటల మాంత్రీకుడు. 'అరవింద సమేత..' లో కూడా సిల్వర్ స్క్రీన్ మొత్తం ఫేమస్ అయిన వాళ్ళనే చూపించారు. ఇక 'అల వైకుంఠాపురం' సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫార్ములా ఏమీ మారలేదని మరోసారి ప్రూవ్ అయింది.

 

ఈ సినిమాలోనూ రాజేంద్రప్రసాద్ తో సహా చాలా మందే కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ సెల్పీలో ప్రముఖులు కనిపించారు. వారిలో మలయాళీ నటుడు జయరాం, సీనియర్ నటి టబు, నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్. దర్శక, రచయిత తనికెళ్ల భరణి తదితరులు ఉన్నారు. ఇంకా ఈ సెల్ఫీలో కొందరు మిస్ అయ్యారట. వారే.. సుశాంత్ నివేదా పేతురాజ్ ఈ సెల్ఫీలో లేరని తెలుస్తోంది. మొత్తానికి తారాగణం విషయంలో త్రివిక్రమ్ సినిమా సినిమాకూ తెర బరువును పెంచేస్తూ ఉన్నారు!  

మరింత సమాచారం తెలుసుకోండి: