మహానటి సక్సెస్ తర్వాత తెలుగులో బయోపిక్స్ సీజన్ ఊపందుకుంది. తాజాగా ఓ హీరో జీవిత చరిత్ర తెరపైకి రానుంది. ఆ హీరో జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనుకోకుండా క్రేజీ హీరో అనిపించుకున్నాడు. కొన్ని మలుపులు ఆ హీరో ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. తెరపైకి వస్తున్న ఆ బయోపిక్ హీరో ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. 

 

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. వెండితెరకు పరిచయమైన అతికొద్ది మంది హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. డెబ్యూ మూవీ చిత్రం.. తర్వాత నువ్వు నేను.. మూడో సినిమా మనసంతా నువ్వేతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. తక్కువ టైమ్ లో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. 

 

ఉదయ్ కిరణ్ ఎంట్రీ అదిరినా.. ఆ తర్వాత సక్సెస్ దక్కడం గగనమైపోయింది. చిత్రం, నువ్వునేను లాంటి హిట్స్ తో క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చిన తేజ దర్శకత్వంలో ఔనన్నా కాదన్నా మూవీ చేసినా.. ఫలితం దక్కలేదు. మెగాస్టార్ చిరంజీవి కూతురితో ఎంగేజ్ మెంట్ రద్దయింది. వరుస ప్లాప్స్ తో ఆఫర్స్ కూడా తగ్గాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా డిప్రెషన్ కు లోనై ఉదయ్ కిరణ్ 33ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

ఉదయ్ కిరణ్ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది తక్కువ సమయమే అయినా.. ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఇప్పుడీ హీరో నిజజీవితం సినిమాగా రూపొందనుంది. ఉదయ్ కిరణ్ గా సందీప్ కిషన్ నటించనున్నాడు. ఉదయ్ కిరణ్ జీవితంలోని అప్ అండ్ డౌన్స్ ఈ బయోపిక్ పై అంచనాలు పెంచేలా అవకాశం ఉంది. మరి ఉదయ్ గా సందీప్ ఎలా ఉంటాడో చూడాలి. ఉదయ్ కిరణ్ జీవితంలోని కొన్ని సున్నితమైన అంశాలను దర్శకుడు ఎలా రూపొందిస్తాడనేది ఆయన అభిమానుల్లో ఒకింత ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆ సన్నివేశాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: