మన సినిమా ఇండస్ట్రీలో పాతకాలం నుండి ఉన్న పద్దతి..కథ ఒకరు రాయడం, దానీ ఇంకొకరు తెరమీదకు తీసుకురావడం. ఇలా కథ రాయడం రాదు అనొచ్చు లేకపోతే కథ రాయడం తెలీదు అనొచ్చు. మొత్తానికి ఇలా సొంతగా కథ రాసుకోలేని టాప్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఆ పేర్లు చెబితే ఆయా దర్శకులు హర్టవడం మాటేమోగాని, కొంతమంది అనవసరమైన రాద్దాంతం చేస్తుంటారు. ఇక ఇప్పటివరకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే కేవలం లైన్ రచయితలకు చెప్పి ఆ తర్వాత స్క్రీన్ మీద కథ, స్క్రీన్ ప్లే...అని కూడా వేసుకున్న దర్శకులున్నారు. మరి అలాంటివాళ్ళ ఇన్స్పిరేషనో ఏమోగాని వి.వి.వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్ కూడా సొంతగా కథ రాయలేరంటే నమ్మి తీరాల్సిందే. కానీ మెగాస్టార్, వెంకటేష్, బాలయ్య, రవితేజ, తారక్ లాంటి స్టార్స్ కి మాత్రం కెరీర్ లో గుర్తుండిపోయో బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. ఆ లిస్ట్ లో ఉన్న మరో టాప్ టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

 

మెగాస్టార్ నటించిన భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహా రెడ్డితో టాప్ లీగ్ డైరక్టర్ల జాబితాలో చేరిపోయారు సురేందర్ రెడ్డి.  కమర్షియల్ గా లాస్ అయినప్పటికి దర్శకుడిగా సూరికి మంచి పేరు వచ్చింది. అంతేకాదు అతి తక్కువకాలంలోనే మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా దక్కించుకోవడం గొప్ప విషయం. అయితే సూరి తరువాత సినిమా ఏమిటి అన్నది సినిమా అభిమానుల క్వశ్చను. వాస్తవంగా సూరి డైరెక్షన్ లో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీగా వున్నారు. ప్రస్తుతం చేస్తున్న ( జాన్ ) వర్కింగ్ టైటిల్ సినిమా ఫినిష్ చేయగానే ఈ సినిమాకే రెడి అవుతాడట. కానీ కథ కావాలి. సూరి దగ్గర ప్రస్తుతం ప్రభాస్ కి కథ లేదు. అలాగే బన్నీ కూడా సూరితో చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం..బన్నీకి కథ కావాలి.

 

సురేందర్ రెడ్డి కూడా వి.వి. వినాయక్ లాంటి వాడే. ఎవరైనా కథ తెస్తే, ఆ కథను సినిమాకు అనుగుణంగా మారుస్తారు తప్ప, స్వంతగా కథ రాయడం అన్నది తక్కువ. అందుకే ఆయన ప్రస్తుతం కథల కోసం వెతుకుతున్నట్లు సమాచారం.ఇక దిల్ రాజు దగ్గర ప్రభాస్ డేట్ లు వున్నాయి. అందువల్ల తరువాత సినిమా ఆయన బ్యానర్ లోనే, ఆ హీరోతోనే అన్నది పక్కా. కానీ కథ సెట్ అవ్వాలి. అటు దిల్ రాజు, ఇటు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఆ పనిలోనే వున్నారని తాజా సమాచారం. ప్రభాస్ జాన్ సినిమా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా కంప్లీటవగానే సురేందర్ రెడ్డి తో రెడీ అవుతాడు. ఈ లోపు సూరీ తన స్క్రిప్ట్ తో రెడీ కావాలి. మరి సూరీ ఈ ఛాన్స్ వాడుకుంటాడో లేదో కొంతకాలం ఆగితే గాని ఒక క్లారిటి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: