మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానం లేని వారుంటారా.  ఆ నాటి నుండి నేటి వరకు ఎందరు కొత్త హీరోలు తెరపైకి వస్తున్నా ఈయనకున్న క్రేజీ మాత్రం ఇప్పటివరకు తగ్గలేదు. ఇక ఎందరెందరో నటీమణులతో ఈయన నటించారు. ఇక వీరితరంలో కలసి నటించిన నటీనటులు అంతా కలసి ప్రతి సంవత్సరం గెట్ టు గెదర్‌ పార్టీ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా చిరంజీవి ఇంట్లో ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో అల నాటి స్టార్స్ అంతా కలిసి గ్రాండ్‌గా వార్షికోత్సవ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 

 

దాదాపు 50 మంది స్టార్ నటీనటులు చిరు ఇంట్లో ఏర్పాటుచేసిన గెట్ టుగెదర్‌లో కలుసుకుని అప్పటి తీపి గుర్తులను గుర్తుచేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా తనను ఆహ్వానించనందుకు బాధపడుతున్నారు ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్. తన బాధను ఫేస్‌బుక్ వేదికగా వ్యక్తం చేశారు. బహుశా నేను మంచి నటుడ్ని, దర్శకుడిని కాకపోవడం వల్ల . ‘నేను ఎయిటీస్ రీయూనియన్‌కు నేను అర్హత సాధించలేదెమో. అందుకే చిరంజీవి గారు నన్ను పిలవనట్లున్నారు. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం. నా సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కానీ జీవితం అన్నాక అలా సాగిపోతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.

 

 

ఇకపోతే ఈయన తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరోచరిత్ర వంటి ఎన్నో సినిమాల్లో నటించినారు. ఇంతకీ ఇంతకీ ఈ రీయూనియన్ అనేది ఏంటంటే.. 80ల కాలంలో సినీ తారలంతా ఏటా ఇలా ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఏ కలర్ డ్రెస్సు వేసుకోవాలో ముందుగానే అన్నీ మాట్లాడుకుంటారు.

 

 

ఈసారి మాత్రం స్టార్లంతా గోల్డ్, బ్లాక్ కాంబినేషన్‌లో ముస్తాబై వచ్చారు. ఇక 2018లో చెన్నై టినగర్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్స్‌లో 22 మంది స్టార్స్ రీ యూనియన్ పార్టీలో పాల్గొన్నారు. ఆ సమయంలో అంతా డెనిమ్స్ అండ్ డైమండ్ థీమ్‌తో పార్టీలో పాల్గొన్నారు.. ఈ రకంగానైనా అందరు కలసి ఆనందంగా గడిపే చాన్స్ వచ్చిందని ఈ పార్టీలో పాల్గొన్న నటీనటులు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: