80వ దశకంలోని స్టార్స్ అందరూ ఒక చోట చేరారు. విందు వినోదాలతో సందడి చేశారు. అయితే ఆ నలుగురు లేని లోటు మాత్రం ఉండిపోయింది. చిరంజీవి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా.. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ పండుగకు ఆ స్టార్స్  ఎందుకు రాలేదు.?

 

80వ దశకంలో సౌత్ ఇండియాలో ఓ వెలుగు వెలిగిన స్టార్స్ అందరూ కలిసి "క్లాస్ ఆఫ్ ఎయిటీస్" పేరుతో  వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొమ్మిదేళ్ల నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహించిన ఈ గెట్ టు గెదర్ లో తారలంతా కలిసి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఆనందంగా గడిపారు. 

 

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ను స్టార్ట్ చేసి పదేళ్లయింది. పదో వార్షికోత్సవం చిరంజీవి ఇంట్లో జరుగగా.. 40మంది తారలు పాల్గొన్నారు. మెగాస్టార్ ఆతిథ్యం ఇవ్వడంతో.. ప్రత్యేకత సంతరించుకుంది. ఎవరెవరు వచ్చారా అన్న ఆసక్తి నెలకొంది. తెలుగు నుంచి ఎయిటీస్ హీరోలు నాగార్జున, వెంకటేశ్ వచ్చినా.. బాలకృష్ణ కనిపించలేదు. మలయాళం నుంచి మోహన్ లాల్ వచ్చినా.. మమ్ముట్టి రాలేదు. రజనీకాంత్ కమల్ హాసన్ లో ఒక్కరూ రాకపోవడంతో ఆ వెలితి కనిపించింది. 

 

"క్లాస్ ఆఫ్ ఎయిటీస్" పదో గెట్ టు గెదర్ లో బాలకృష్ణ, మోహన్ బాబు.. రాజశేఖర్ లాంటి హీరోలు కనిపించకపోవడంతో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. చిరంజీవితో బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబుకు ఉన్న దూరాన్ని "క్లాస్ ఆఫ్ ఎయిటీస్" మరోసారి బయటపెట్టిందని కామెంట్ చేశారు. అలాగని ఈ వార్తలు నిజం కాదంటున్నాయి ఫిలిం వర్గాలు. ఇప్పటి వరకు జరిగిన గెట్ టు గెదర్ కార్యక్రమాల్లో రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున.. ఒకటీ రెండు సందర్భాల్లోనే కనిపించారు. చిరంజీవి మాత్రమే మ్యాగ్జిమమ్ పాల్గొన్నారు. ఈ లెక్కన పదో గెట్ టు గెదర్ లో బాలయ్య, రజనీ, కమల్ కనిపించకపోవడం వెనుక వివాదం రేపాల్సిన పనిలేదంటున్నాయి ఫిలిం వర్గాలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: