బాలీవుడ్ లో అద్బుతమైన జంటల్లో దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లవ్లీ కపుల్‌కి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఎంతోమంది అభిమానులున్నారని చెప్పుకోవచ్చు. దీపికా పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమ్ చోప్రా ఓ భారీ ఇంటర్వ్యూ చేసింది. అయితే గత పదేళ్లుగా మోస్ట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కొందరు నటులను తీసుకుని ఇంటర్వ్యూ చేసింది. 

 

అందులో రణ్‌వీర్ సింగ్, విజయ్ దేవరకొండ, అలియా భట్, మనోజ్ బాజ్‌పెయి, విజయ్ సేతుపతి, పార్వతి తిరువోతు, ఆయుష్మాన్ ఖురానా, అలియా భట్ లాంటి వాళ్లున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని విషయాల గురించి మాట్లాడుతూ మధ్యలో ప్రేమ గురించి కూడా టాపిక్ వచ్చింది. దీపికను కూడా ఈ ప్రశ్న అడిగింది అనుపమ్ చోప్రా. పక్కనే భర్త రణ్‌వీర్ ఉన్నాడు. కానీ అతడేమైనా అనుకుంటాడేమో అనే కనీస మొహమాటం కూడా లేకుండా తన ప్రేమ గురించి దీపిక బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. 

 

తాను ముందు రణబీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్నానని కానీ.. చివరికి రణ‌్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఈ విషయంలో తనకు అస్సలు సిగ్గు లేదని చెప్పింది ఈ బ్యూటీ. అలాగే  త్వరలోనే రణబీర్, అలియా పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వాళ్ల పెళ్లిని కూడా కన్ఫర్మ్ చేసింది దీపిక. అయితే తన అనుమతి లేకుండా దీపిక తన పెళ్లి గురించి ప్రకటించేయడంతో అక్క‌డే ఉన్న ఆలియాకు కాస్త కోపం వచ్చింది. దీంతో అలియా భట్ స్పందిస్తూ.. నా పెళ్లి గురించి ఎందుకు చెబుతున్నావ్ అని ప్రశ్నించింది. 

 

అప్పుడు దీపిక తనని తాను సమర్ధించుకుంటూ.. ‘గయ్స్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటో చూద్దామని అలా చెప్పాను’ అన్నారు. కాగా, రణ్‌బీర్, ఆలియా ప్రేమాయణం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ పెళ్లి గురించి బహిరంగంగా మాట్లాడలేదు. ఏదేమైన ఈ కార్య‌క్ర‌మంలో దీపిక నోరు జార‌డంతో ఆలీయాకు కోపం వ‌చ్చినంత ప‌నైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: