సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ ఎన్నో ఏళ్ళ కలల ప్రాజెక్ట్‌. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్‌ తేజ్ భారీ బడ్జెట్‌తో నిర్మించి అక్టోబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ ఆశించినంతగా కమర్షియల్ సక్సస్ ను అందుకోలేకపోయింది. మొత్తంగా చూస్తే బయ్యర్లకు బాగా నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ టాక్.

 

ఇక ఈ సినిమాపై సీనియర్ నటుడు గిరిబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చిరంజీవి నేను కలిసి చాలా సినిమాలు చేశాం. ఇప్పటికీ నా తమ్ముడులాగే ఉంటాడు. కనిపిస్తే ఆత్మీయంగా పలకరిస్తాడు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి ఆత్మీయత ఉంది. ఇటీవలే ఆయన నటించిన 'సైరా' కూడా చూశా. అద్భుతమైన సినిమా తీశావ్ అని చెప్పా. కాని.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత సినిమా తీశాం కాబట్టి.. అది యూత్‌ని కనెక్ట్ కాదు. జనరేషన్ గ్యాప్ వచ్చేసింది.. ఎప్పుడో జరిగింది ఇప్పుడు తీస్తే లాభం ఉండదని నిర్మొహమాటంగా చెప్పా. 

 

స్వాతంత్ర్యం వచ్చి మూడు జనరేషన్‌లు అయిపోయిపోయింది కాబట్టి.. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం, వీరులు అంటే యూత్ చూడరు. అదే పాకిస్థాన్‌పై యుద్ధం అంటే ఎగబడి చూస్తారు. ఎందుకంటే అది కరెంట్ సబ్జెక్ట్. క్లబ్‌లు, పబ్‌ల కాలం నడుస్తోంది. వాళ్లకు డాన్స్‌లు, ఫైట్‌లు కావాలని అంటారు. బాహుబలి లాంటి సినిమా తీస్తే మళ్ళీ చూస్తారు..ఎందుకంటే అది కొత్తగా తీశారు కాబట్టి.. అంటూ బాహుబలి సైరా సినిమాల మీద మన సీనియర్ నటులు గిరిబాబు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చాలా నిర్మొహమాటంగా చెప్పారు. ఆలోచిస్తే ఇందులో వాస్తవం కూడా ఉందనిపిస్తోంది. ఇక మెగాస్టార్ కొరటాల శివతో త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న సంగతి తెలిసిందే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: