ప్రస్తుతం వరుస పండుగులతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు.. జనాల్లో మరింత క్రేజ్ ను తీసుకురావడానికి.. సినీ జనాలు కూడా సంబరాల్లో మరింత జోష్ పెంచడానికి కొత్త కథతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. అంతే జోష్ తో ప్రస్తుత సినిమాల నుండి ఏదోక వార్తను ఫ్యాన్స్ కు అందిస్తూ వారి ఆనందాన్ని మరింత పెంచుతున్నారు. ..

 


అసలు విషయానికొస్తే.. గత పండగులతో  పోలిస్తే ఈ సారి పండుగకు రకాల కొత్త సినిమాలు కొత్త కథతో కొత్త హంగులతో ప్రేక్షకులను అలరిస్తాయి..ఇకపోతే ఈ సారి చిన్న స్టార్ ల మూవీస్ నుండి పెద్ద స్టార్ హీరోల మూవీలు రిలీజ్ కావడంతో సినీ సందడి మామూలుగా లేదని చెప్పాలి.. మొన్న వచ్చిన పండుగులకు సినిమా వాళ్ళు చాలా హోరెత్తించారు..

 

కాగా ఈ సంక్రాంతి కి సినిమాలా సందడి ఎక్కువగా అయితే...మహేష్ బాబు నటిస్తున్న సరీలేరు నికేవ్వరూ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..ఈ సినిమా సంక్రాంతి కానుక రిలీజ్  కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ కు  జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.. టీజర్ కు మాత్రం 20 మిలియన్స్ వ్యూస్ తో దూసుకు పోతుంది...అదే మాదిరిగా అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో సినిమా కూడా జనవరి 12న రిలీజ్ కాబోతుంది..

 


2020 సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి.. దాదాపు గా ఈ సంక్రంతికి చాలా సినిమాలు ప్రేక్షులముందుకు రాబోతుంది.. ఈ సినిమాలతో పాటుగా మరిన్ని సినిమాలు రిలీజ్ కాబోతుంది..తమిళ్ తలైవా రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంతమంచివాడవురా సినిమాతో పాటుగా మరి కొన్ని సినిమాలు కూడా రిలీజ్  కాబోతున్నాయి.. ఈ సినిమా లల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: