రాజమౌళి సెలక్షనే సెలక్షన్. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్.. విలన్ సెలక్షన్ లేటయితే అయింది గానీ.. రీసెర్చ్ చేసి మరీ ఎంచుకున్నాడు. యాక్టింగ్ కు దూరమైన  ఇద్దరినీ ఏం చెప్పి ఒప్పించాడో మరి. మరోవైపు అనుభవం లేని హీరోయిన్ ని సెలక్ట్ చేసుకున్నాడు జక్కన్న. 

 

ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియాభట్ సెలక్ట్ అయింది. ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ నటి డైసీని సెలక్ట్ చేసినా.. పర్సనల్ ఫ్రాబ్లమ్స్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. ఆ తర్వాత చాలామందిని అనుకున్నా.. ఒక్కరూ సెట్ కాలేదు. చివరకు యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ లేని ఐర్లండ్ అమ్మాయి ఒలివియా మోరిస్ ను సెలక్ట్ చేశాడు జక్కన్న. 

 

సినిమాలో నటిస్తున్న ఫారిన్ నటీనటులను ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్ ఎనౌన్స్ చేసింది. రాజమౌళి సినిమాలో హీరో కంటే విలన్ పవర్ ఫుల్ గా ఉంటాడు. ఆ ప్రతినాయకుడు ఎవరా అని చాలా కాలంగా ఎదురు చూశారు అభిమానులు. అయితే ఈ సారి ఆ  ఛాన్స్ ఫారిన్ నటుడికి ఇచ్చాడు జక్కన్న. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన 55ఏళ్ల రే స్టీవెన్ సన్ విలన్ గా నటిస్తున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత స్టీవెన్ ఒప్పుకున్న సిినిమా ఇది. స్టీవెన్ సన్ రాకకోసం ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేసింది చిత్ర యూనిట్. 

 

ట్రిపుల్ ఆర్ లో లేడీ విలన్ కూడా ఉంది. ఐర్లండ్ నటి అలిసన్ డూడీ ప్రతినాయికగా నటిస్తోందని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేసింది. 85లో యాక్టింగ్ మొదలుపెట్టిన డూడీ ఈ 33ఏళ్ల కెరీర్ లో నటించింది 11 సినిమాలే. రాజమౌలి కథ చెప్పిన విధానానికి ఇంప్రెస్ అయిందో ఏమోగానీ.. తెలుగు సినిమా చేస్తోంది. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: