ఇమ్రాన్ ఖాన్, అవంతిక విడిపోయారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఫినాన్షియల్ మేటర్స్ తో ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిందనీ.. మ్యూచువల్ గా ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారనీ బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటున్న అవంతిక ఓ పోస్ట్ తో ట్వీట్ చేసింది. 

ఇమ్రాన్ ఖాన్, అవంతిక విడిపోయారనీ.. అమీర్ ఖాన్ కూడా మేనల్లుడి కాపురాన్ని నిలబెట్టలేదని ఇలా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పైగా అమీర్, అవంతిక ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. దీంతో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సెపరేట్ అయ్యారని అంతా అనుకుంటున్నారు. కానీ రీసెంట్ గా ఓ కొటేషన్ పోస్ట్ చేసి జనాలందరినీ కన్ ఫ్యూజన్ లో పడేసింది అవంతిక. 


ప్రేమికులు అంటే దగ్గరగానే ఉండాల్సిన అవసరం లేదు. పార్టీలు, పబ్బులు అంటూ చిల్ అవ్వక్కర్లేదు. రిలేషన్ లో సిన్సియర్ గా ఉన్నవాళ్లు దూరంగా ఉన్నా ప్రేమించుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ల మధ్య లవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అవంతిక పోస్ట్ చేసింది.  దీంతో ఇమ్రాన్, అవంతిక మళ్లీ కలుస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. 


ఇమ్రాన్ ఖాన్ కెరీర్ డల్ అయిందనీ.. సంపాదన లేదనే కారణంతో దూరమయ్యారని వీళ్ల సన్నిహితులు చెప్పారు. మరి ఈ గొడవల తర్వాత ఇమ్రాన్ కెరీర్ లో పెద్దగా మార్పులు కూడా రాలేదు. కానీ ఇప్పుడు అవంతిక ప్రేమ కవితలు రాస్తోంది. మరి అవంతికలో ఈ మార్పుకు కారణమేంటో అని ముంబై జనాలు ఆరాతీస్తున్నారు. 

 

మొత్తానికి అవంతిక ట్వీట్ జనాలను డైలమాలో పడేసింది. అసలు వీళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఈ జంట విడిపోయారన్నది అందా పుకారేనా అని చెవులుకొరుక్కుంటున్నారు. అవంతిక ట్వీట్ తో ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..!

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: