అనుమాలిక్ మౌనం వీడాడు. ఇన్నాళ్లూ వచ్చిన ఆరోపణలన్నింటికీ సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పాడు. ఆయనపై వచ్చిన మీటూ ఆరోపణలు, ఏడాది కాలంగా ఎందుకు మౌనంగా ఉంటోంది అన్నీ వివరించాడు అను మాలిక్. 

 

మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ లైంగికంగా వేధించాడని సింగర్స్ సోనా మొహాపాత్ర, శ్వేతా ఈయనపై ఆరోపణలు  చేశారు. అను మాలిక్ దుష్టుడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీళ్లు ఆరోపించాక మరికొంతమంది సింగర్స్ కూడా అనుమాలిక్ పై ఇవే తరహా ఆరోపణలు చేశారు. దీంతో ఇండియన్ ఐడల్ షో జడ్జిమెంట్ నుంచి ఈయనను తప్పించారు.

 

ఏడాది కాలంగా సైలెంట్ గా ఉన్న అనుమాలిక్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాడు. మీటూ ఆరోపణలపై రియాక్ట్ అయ్యాడు. ఏడాది కాలంగా వస్తోన్న ఆరోపణలతో టార్చర్ పడుతున్నానని చెప్పాడు. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ఇండియన్ ఐడల్ షోకు వచ్చాక నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా మీరు మారకపోతే కోర్టుకు వెళ్తానని పోస్టు చేశాడు. 

 

నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయనే ఇన్నాళ్లూ.. సైలెంట్ గా ఉన్నాననీ.. కానీ మౌనంగా ఉండటమే తాను చేసిన పెద్ద తప్పని ఇప్పుడు అర్థమైందని రాసుకొచ్చాడు మాలిక్. అంతేకాదు ఈ ఆరోపణలతో జీవనోపాధి దూరమైందనీ.. ఈ వయసులో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఈ ఆరోపణలను సహించలేకపోతున్నానని పోస్ట్ చేశాడు. మరి మాలిక్ పోస్ట్ పై ఆరోపణలు చేసిన సింగర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఇన్నాళ్లకు స్పందించాడు మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్. మరి ఎంత మాత్రం నిజమో.. ఎంత వరకు అబద్దమో ఎవరికీ తెలియదు. ఆ నిజాలు ఎలా నిగ్గుతేలతాయో అనేది ఇపుడు సస్పెన్స్ గా మారింది. ఈ అపవాదు నుంచి అనుమాలిక్ ఎలా బయటపడతాడో కాలమే నిర్ణయించాలి.  ఏం జరుగుతుందో చూద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: