ఒకటి రెండు హిట్లు పడితేనే హీరోలు సూపర్ స్టార్లు అవుతున్నారు. అలాంటిది నేషనల్ అవార్డులు కొడితే ఆ హీరో రేంజ్ మరోలా ఉంటుంది. కానీ ధనుష్ మాత్రం బ్లాక్ బస్టర్స్ ఉన్నా కోలీవుడ్ టాప్ హీరో కాలేకపోతున్నాడు. ఇంకా సెపరేట్ ట్రాక్ లోనే ఉండిపోతున్నాడు. మరి ఈ హీరో రేంజ్ మారకపోవడానికి కారణమేంటో తెలుసా ?


తమిళనాట సూపర్ పెర్పామెన్స్ లో ధనుష్ టాప్ అని చెబుతారు. తెలుగు, హిందీ పరిశ్రమల్లోనూ ధనుష్ కి మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో అయితే ఫిల్మ్ ఫేర్ కూడా అందుకున్నాడు. అలాంటి హీరో ఇంకా తమిళనాట టాప్ రేస్ కి దూరంగానే ఉన్నాడు. అజిత్, విజయ్ మార్కెట్ కు దూరంగానే మిగిలిపోతున్నాడు ధనుష్. 

 

మాస్ సినిమాలు చేస్తే టాప్ చైర్ కు దగ్గర కావడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్. అలా అనుకుంటే ధనుష్ ఎక్కువగా ఫుల్ మాస్ రోలసే ప్లే చేశాడు. రీసెంట్ గా వచ్చిన "అసురన్" లో అయితే ధనుష్ ఊరమాస్ గా కనిపించాడు. ఈ సినిమాతో ధనుష్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనే టాక్ కూడా వచ్చింది. మరి మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే బోలెడన్ని డౌట్స్ ఉన్నాయంటోంది ట్రేడ్ మార్కెట్. 

 

రజనీకాంత్ చేజారిన నెంబర్ వన్ ని అందుకోవడానికి అజిత్, విజయ్ టఫ్ ఫైట్ చేస్తున్నారు. కానీ ధనుష్ మాత్రం ఆ రేస్ కు కొంచెం దూరంగానే ఉన్నాడు. దీనికి అతను ఎంచుకుంటోన్న స్క్రిప్టే కారణమంటున్నారు. ఈ హీరో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు. హిట్స్ కొడుతున్నాడు కానీ.. లార్జ్ స్కేల్ లో ఆడియన్స్ ని డైహార్డ్ ఫ్యాన్స్ ని మలుచుకోలేకపోతున్నాడు. అందుకే ధనుష్ సక్సెస్ రేట్ కి తగ్గట్టుగానే స్టార్ స్టేటస్ పెరగట్లేదని కోలీవుడ్ టాక్. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: