పవన్ రాజకీయాలలోకి అడుగు పెట్టిన తరువాత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం ఒక హాబీగా మారింది. తన వ్యక్తిగత జీవితం పై వస్తున్న విమర్శలకు పవన్ ధీటైన సమాధానం ఇస్తున్నా అతడి మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం ఇప్పటికీ పవన్ ను విమర్శించే వారికి ఒక అస్త్రంగా మారుతూనే ఉంది. 

ఇది ఇలా ఉంటే ఏ విషయం పై అయినా ఒక నిఘంటువుగా అందరికీ సమాచారాన్ని అందించే గూగుల్ సర్చ్ లో ఎవరైనా పవన్ కళ్యాణ్ భార్య పేరు అని సర్చ్ లోకి వెళితే పవన్ మూడు పెళ్లిళ్లకు సంబంధించిన భార్యల పేర్లు వస్తున్నాయి అని అంటున్నారు. దీనితో పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని గూగుల్ గుర్తించింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. 

ఇదే గూగుల్ సర్చ్ లో నాగార్జున ప్రకాష్ రాజ్ ల పేర్లతో సర్చ్ చేసిన వారికి వారి గత జీవితానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. అయితే ఇలాంటి సున్నిత విషయాలను పెద్దగా చేస్తూ వ్యక్తిగత జీవితంలోని కొన్ని చేదు నిజాలను హైలెట్ చేస్తూ ఒక సెలెబ్రెటీ జీవితం పై నెగిటివ్ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పవన్ వీరాభిమానులు తీవ్ర అసహనానికి లోనౌతున్నారు. 

పవన్ అనుసరించే రాజకీయ ఎత్తుగడల గురించి ఘాటైన విమర్శలు చేస్తే బాగుంటుంది కాని ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను గూగుల్ సర్చ్ కూడ గుర్తించింది అంటూ నెగిటివ్ ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అంటూ పవన్ అభిమానులు తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో ఒక వ్యక్తిని దెబ్బ తీయాలి అంటే అతడి ఆర్ధిక మూలాలు దెబ్బ కొట్టడం కుదరకపోతే వ్యక్తిగత జీవితంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ కామెంట్స్ చేయడం ఒక అలవాటుగా మారిన పరిస్థితులలో పవన్ ఇలాంటి నెగిటివ్ ప్రచారాలను పట్టించుకోకుండా తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయవలసిన పరిస్థితి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: