పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా  టాలీవుడ్ కి  హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ  తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లికించుకున్నారు  పవన్ కళ్యాణ్. టాలీవుడ్లో అన్నకు మించిన క్రేజ్ సంపాదించుకున్న హీరో పవర్ స్టార్. అభిమానుల్లో పవర్ స్టార్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. పవర్ స్టార్  కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు అభిమానులు. పవర్ స్టార్ అంటే అభిమానులకు ఒక పిచ్చి ఉంటుంది. అయితే ప్రతి హీరోకి ఒక సపరేట్ సిగ్నేచర్ మార్క్  ఉంటుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  కూడా ఒక  స్పెషల్ సిగ్నేచర్  మార్క్ ద ఉంది. 

 

 

 

 మామూలుగా పవర్ స్టార్  పేరు ఎత్తితేనే  అభిమానుల్లో  కరెంటు పాస్ అవుతుంది ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ సిగ్నేచర్ అయిన   మెడమీద చెయ్యి పెట్టుకుని నిమిరాడు అంటే ఇక అంతే అభిమానుల  ఈలలు గోలలు   హోరెత్తి పోతుంటుంది  పోతుంటుంది. పవన్ కళ్యాణ్  ఈ సిగ్నేచర్ మార్క్ ను  చాలా మంది హీరోలు ఫాలో అవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మార్క్ స్టిల్ను ఏ హీరో చేసినప్పటికీ కూడా అభిమానులు హోరెత్తిపోతు ఉంటారు. అయితే తాజగా  మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ మార్క్ సిగ్నేచర్ ను  చేసి అభిమానులను ఆశ్చర్య పరిచాడు. మామూలుగా అయితే అన్నయ్యల సిగ్నేచర్ లను  తమ్ముళ్లు కాపీ కొడుతుంటారు కానీ ఇక్కడ మాత్రం చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ సిగ్నేచర్ ను  కాఫీ కొట్టేసాడు. 

 

 

 

 నిఖిల్ హీరోగా నటిస్తున్న అర్జున్ సురవరం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ మెగా సీన్ చోటు చేసుకుంది.ఈ  సినిమాలో  విప్లవకారుడు చేగువేరా గురించి ఒక పాట ఉంటుంది. శంకర్ మహదేవన్  ఈ పాటను పాడారు. ఈ పాటను చూస్తున్నంతసేపు తనకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు అంటూ చిరంజీవి తెలిపాడు. ఈ సందర్భంగా మెడ మీద చేతులు వేసి వాలుగా  చూస్తూ పవన్ కళ్యాణ్  సిగ్నేచర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఒక్కసారిగా ప్రీ  రిలీజ్ ఈవెంట్ మొత్తం పిల్లలు గోలలతో  హోరెత్తిపోయింది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ ను ... అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాపీ కొట్టడం తో  పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంబరపడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: