సర్వసాధారణంగా చిరంజీవి హీరోయిన్స్ పై ఓపెన్ గా రొమాంటిక్ కామెంట్స్ చేయడు. అయితే దీనికి భిన్నంగా చిరంజీవి నిన్న జరిగిన ‘అర్జున్ సురవరం’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠీ పై చేసిన రొమాంటిక్ కామెంట్స్ ఏకంగా లావణ్యకు షాక్ ఇచ్చి ఆమెను ఆశ్చర్యాన్ని కలిగించాయి. 


లావణ్య త్రిపాఠి గురించి తన మనసులో ఉన్న విషయం చెపుతాను అంటూ చిరంజీవి తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు. ఆమె నవ్వు అంటే తనకు బాగా ఇష్టమని ముఖ్యంగా ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గ పై పడే సొట్ట తనకు మరింత ఇష్టమని చెపుతూ ఆమె పై పొగడ్తల వర్షం కురిపించాడు. 


ముఖ్యంగా ‘భలే భలే మగాడి వోయ్’ మూవీలో ఆమె చాల అందంగా కనిపించిందని అప్పటి నుండి తాను ఆమెకు వీరాభిమానిగా మారిపోయాను అంటూ చిరంజీవి కామెంట్స్ చేసాడు. ఇలాంటి కామెంట్స్ చిరంజీవి నోటివెంట రావడంతో ఆనందంతో షాక్ కు గురైన లావణ్య చిరంజీవికి ఒంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించింది.ప్రస్తుతం లావణ్యకు ఐరన్ లెగ్ హీరోయిన్ ట్యాగ్ కొనసాగుతోంది. ఆమె వైపు మిడిల్ రేంజ్ హీరోలు కూడ చూడటం లేదు. 


ఇప్పుడు చిరంజీవి నోటివెంట లావణ్య పై ఈ ప్రశంసలు రావడంతో లావణ్యకు మార్కెట్ పెరుగుతుందేమో చూడాలి. నిన్నటి ఫంక్షన్ లో ఎప్పుడు ఎవరూ చూడని చిరంజీవి ప్రవర్తనను పరిశీలించిన వారు మాత్రం చిరంజీవి 65 సంవత్సరాలు వచ్చినా తాను ఇంకా రొమాంటిక్ అని చెప్పుకోవడానికి ఇలా లావణ్యను అస్త్రంగా వాడుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒకవైపు నిఖిల్ ని మరొక వైపు లావణ్యను ఇలా పరాజయాల బాటలో పయనిస్తున్న ఈ ఇద్దరి పై చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఎంత వరకు వారికి పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చి పెడతాయో చూడాలి అన్న కామెంట్స్ అందరి నోటి వెంట వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: