కోలీవుడ్ లో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్న నటుడు, దర్శకుడు, నిర్మాత బాగ్యరాజా తాజాగా తనదైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.  తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచన, దర్శకత్వం వహించారు భాగ్యరాజా.  ముంధనై ముడిచ్చు (1983) అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. భాగ్య అనే వార పత్రికకు సంపాదకుడు. కొన్ని నవలలు కూడా రాశాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతుంది. ప్రతిరోజూ ఎక్కడ చూసినా చిన్న పిల్లలపై చివరికి వృద్ద మహిళలపై కూడా అత్యాచారాలు, హత్యలు కొనసాగిస్తున్నారు కొంత మంది మృగాళ్లు. దీనిపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.  


ఇక సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో నటులు భాగ్యరాజా మహిళలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, సినీ పరిశ్రమకు చెందిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ మూవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో మహిళలపై కట్టుదిట్టంగా రూల్స్  విధించినప్పుడు ఇలాంటి తప్పులేమీ జరగలేదు అని అన్నారు. ఎక్కడా అత్యాచారాలు అన్న పదం వినిపించలేదు.... కానీ ఎప్పుడైతే ఆడవాళ్లు సెల్ ఫోన్లకే పరిమితం అవ్వడం.. ఫోర్న్ సైట్ల ప్రభావం..వెరసి స్త్రీలపై రేప్ లు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. 


ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా  ఫోన్‌లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై అనేక ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. ఒకప్పుడు మహిళలు పద్దతిగా ఉండేవారని.. అలాంటి సమయంలో వారి జోలికి ఎవరూ వెళ్లలేదని...అప్పట్లో అత్యాచారం మాటలే వినిపించేవి కావని అన్నారు. ఇటీవల తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో మగవాళ్లు పైన మాత్రమే నిందలు వేయడం సరికాదని అన్నారు.  అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు మగవారు రెండో ఫ్యామిలీ ఉన్నా రెండు ఫ్యామిలీలను చక్కదిద్దుకోగలడు..కానీ ఆడవారు భర్త ఉండగానే మరో లవర్ ని మెయింటేన్ చేస్తే మొదటి వాడు అడ్డు వస్తున్నాడని హత్యలు చేయిస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయని అన్నారు. 


తన సినిమాల్లో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా,  అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నారు. తాజాగా భాగ్యరాజా వ్యాఖ్యలపై మహిళలలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు..ఆడవారంటే అంత చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. భాగ్యరాజ్‌ కామెంట్స్ మరింత దుమారాన్ని రేపనున్నాయి. భాగ్యరాజా మరి ఈ పొరపాటుని ఇలా సరిదిద్దుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: