క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 15 కోట్లు విలువచేసే ఒక ఇల్లును ఫిలింనగర్ ప్రాంతంలో కొనుక్కున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇల్లు కొనుక్కునే విషయంలో విజయ్ దేవరకొండ అనుసరించిన విధానం అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అంటూ కొందరు అతడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ప్రస్థుతం వాస్తు నమ్మకాలు ప్రజలలో విపరీతంగా పెరిగిన నేపధ్యంలో వాస్తు సలహాలు తీసుకోవడం దాన్ని ఆచరించడం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం విజయ్ కొన్న ఇల్లు వెనుక స్థలం బాగా లోతుగా వుంటుందని అది విజయ్ ఇంటికి నైరుతి దిశలో ఉందని వాస్తు రీత్యా అది అంతమంచిది కాదు అన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు ఇప్పటికే విజయ్ కొనుక్కున్న ఇల్లు రెండు సార్లు చేతులు మారింది అన్న ప్రచారం కూడ జరుగుతోంది. వాస్తవానికి ఈ విషయాలు విజయ్ సన్నిహితులు అతడి దృష్టికి ఈ ఇల్లు కొనేముందు తీసుకు వచ్చినా విజయ్ పట్టించుకాలేదని టాక్. అంతేకాదు తనకు వాస్తు జాతకాల పై పెద్దగా నమ్మకం లేదు అంటూ తన సన్నిహితులు వద్ద కామెంట్ చేసినట్లు కూడ వార్తలు వినిపిస్తున్నాయి. 


దీనితో విజయ్ దేవరకొండ నటించే పాత్రల విషయంలోనే కాదు అతడి లైఫ్ స్టైల్ లో కూడ చాల విభిన్నంగా ఉంటాడు అంటూ కామెంట్స్ ఉన్నాయి. ఈ కొత్త ఇంటిలోకి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ వారిని ఎవర్ని పిలవకుండా అతి నిరాడంబరంగా తన కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని ముగించాడు. ప్రస్తుతం విజయాలకు బ్రేక్ పడ్డ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ తన కొత్త ఇంటిలోకి మారిన తరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. దీనితో విజయ్ దేవరకొండకు మూఢనమ్మకాలు సెంటిమెంట్స్ లేని ఈ కొత్త ఇల్లు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి అన్న మాటలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: