ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిపోతున్నారు.  ఈ నేపథ్యంలో ‘ఒరు అదార్ లవ్' సినిమా లోని చిన్న వీడియో సాంగ్ లో కన్ను కొట్టిన కేరళా కుట్టి ఇంటర్నెట్ సన్సేషన్ సృష్టించింది.  ఓ పాటలో కన్నుగీటి సెలెబ్రిటీగా మారిపోయింది. చిన్న వీడియో ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా వారియర్ దేశంలో కుర్రారళ్లనే కాదు అన్ని వర్గాల వారిని సమ్మోహితులను చేసింది.  అయితే  ప్రియావారియర్ స్టైల్లో ఎంతో మంది సెలబ్రెటీలు కన్నుగీటిన స్టిల్స్ పంపినా పెద్దగావర్క్ ఔట్ కాలేదు.  

 

ఈ పాపులారిటీని క్రేజ్ చేసుకొని ప్రియావారియర్ ఎన్నో సినిమాల్లో వస్తుందని భావించారు. కానీ ఆమె మాత్రం తన సినిమా రిలీజ్ తర్వాత ఇతర భాషల్లో నటిస్తానని చెప్పడం..ఆ సినిమా రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది.  ఈ కేరళా కుట్టికి సినిమా ఛాన్సులు అరకోరగా మాత్రమే వస్తున్నాయి. దాంతో హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాతో దుమ్మురేపుతుంది. కేరళ కుట్టి ప్రియావారియర్ మరోమారు తన కొత్తలుక్‌తో సంచలనానికి సిద్దమైంది. అయితే ఈసారి తన కొంటె చూపుతో అందాల చీరకట్టుతో.  ఎర్ర చీర కట్టుకొని సన్నని తన నడుం అందాలు చూపిస్తూ..మత్తెక్కించేలా ఉన్న ప్రియావారియర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

 

 తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.  షేడెడ్ తో ఉన్న ఎర్రని చీర..డిజైనింగ్ తో పూల పూల జాకెట్టు..స్టైలిష్ హెయిర్ మొత్తానికి ఆ మాలీవుడ్ బ్యూటీని చూస్తుంటే కుర్రాళ్ల మతులు పోతున్నాయి. ఎలాగూ సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు.. దీనితో గ్లామర్ షోలో మెప్పిస్తే ప్రియా వారియర్ కు మరింతగా మైలేజ్ పెరుగుతుంది. ఈ సంగతి మాలీవుడ్ భామకు అర్థమయినట్టుంది..అందుకే సెగలు రేపుతున్న ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చచేయాలనుకుంటుంది. కాగా, ఇటీవల ఆమె ఒక ప్రకటనలో నటించేందుకు కోటి రూపాయలు తీసుకున్నదని సమాచారం. మరి ప్రకటనలకే పరిమతం అవుతుందా.. ఇండస్ట్రీలో మెప్పిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: