టాలీవుడ్ యూత్ అండ్ క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చేసింది త‌క్కువ సినిమాలే అయినే ఒకేసారి యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాడు. ప్ర‌స్తుత‌తం ఈ హీరో ఒక కొత్త ఇల్లు కొన్నాడ‌ని తెలిసింది. ఇప్పటి దాకా శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఇప్పుడు ఫిలింనగర్ లోని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ ఇల్లు ఎంత‌కు కొన్నారు. అది ఎలా ఉంది అందులోని సౌక‌ర్యాల గురించి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా న‌డుస్తుంది.  హీరో శ్రీకాంత్‌కి దగ్గరగా విజయ్ దేవరకొండ ఫిలింనగర్‌లో కొత్త ఇల్లును తీసుకున్నారు. ఎంతో ఇష్టంతో ఈ ఇంటిని కొనుగోలు చేసిన విజయ్ దేవరకొండ గత ఆదివారం రోజు తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఈ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఇంటిని ఎంత పెట్టి కొన్నారో తెలుసా? విజయ్ దేవరకొండ ఆ ఇంటిని భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ఆయన 20 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు టాక్ నడుస్తోంది. అన్నికోణాల్లో ఆలోచించి విజయ్ దేవరకొండ ఈ ఇల్లును కొనుగోలు చేశాడని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 ఇక ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉందని అంటున్నారు జనం. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ స్టైల్‌కి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారట ఈ రౌడీ స్టార్. మొత్తానికి పెళ్లికి ముందే ఇలా అఫీషియల్ ఇల్లు కొనేయడం ఆయన అభిమానులను ఆనందపరుస్తోంది. విజయ్ దేవరకొండ బిజినెస్ స్టెప్స్ ఇప్పటికే ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా'' లాంటి సినిమాలతో తన క్రేజ్ అమాంతం పెచుకున్న విజయ్ అన్నికోణాల్లో ఆలోచిస్తూ ముందడుగులేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.  బిజినెస్ రంగం లోకి కూడా ప్రవేశించిన ఈ యంగ్ హీరో రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల అమ్మకాలు ప్రారంభించి సక్సెస్ సాధించిన ఆయన, ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించాడు. 

 

 ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: