వరుణ్ తేజ్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. కథల్ని ఎన్నుకోవడంలో విభిన్నతని చూపిస్తూ తన తోటి హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తున్నాడు. వరుణ్ తేజ్ మొదటి సినిమా నుండి గమనిస్తే, ఆయన ఎంచుకున్న కథలు చాలా ప్రత్యేకమైనవి. అనవసర వాణిజ్య అంశాల జోలికి వెళ్ళకుండా కేవల కథని నమ్మి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫిదా సినిమాలో హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యమున్నప్పటికీ ఆ సినిమాని ఒప్పుకున్నాడంటే అతని కథల ఎంపిక ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ ౨ సినిమాలో తనదైన కామెడీతో నవ్వులు పుయించిన వరుణ్, మొన్నటికి మొన్న గద్దలకొండ గణేష్ గా వచ్చి తనలోని మాస్ ని పరిచయం చేశాడు. ఈ సినిమాలో కథా పరంగా విలన్ పాత్రే అయినా తన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. దీనితో వరుణ్ తేజ్ కి మాస్ హీరోగానూ పేరొచ్చింది.

 

అయితే వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నారు. స్పోర్ట్ డ్రామా ఉండే సినిమాకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయన్న విషయం తెలిసిందే. లేదంటే పైపైన తీసేస్తానంటే ఆ స్పోర్ట్ లో ఇంటెన్సిటీ కనిపించక సినిమా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమా కోసం ఎక్కువ బడ్జెట్ ని కేటాయించారట నిర్మాతలు.

 

ఇప్పటి వరకు వరుణ్ సినిమాలకి కాని బడ్జెట్ ఈ సినిమాకి అవుతుందట. దాదాపుగా 35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారట. వరుణ్ తేజ్ సినిమాలు మార్కెట్ లో విజయం సాధిస్తుండడంతో పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదన్న నమ్మకంతో ఉన్నారట నిర్మాతలు. మరి మిగతా సినిమాల్లాగా ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా చూడాలి. మరో విషయం ఏంటంటే, ఈ సినిమాకి తన రెమ్యునరేషన్ ని కూడా పెంచాడట వరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: