సొంత ఇల్లు కొనుకొని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల  కొత్త ఇంటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ  శ్రీనగర్ కాలనీలో వుండేవారు  ఇప్పుడు తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది.  ఆదివారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశాడు. ప్రస్తుతం సినీవర్గాల్లో విజయ్‌ ఇల్లు హాట్‌టాపిక్‌గా మారింది. వరుస హిట్లతో విజయ్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్న విజయ్‌.. తన రేంజ్‌కు తగినట్లుగా భారీగా కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

 

విజయ్ ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉన్నది. 15 నుంచి 20 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఇంటిని  కొన్నట్టు సమాచారం. ఈ ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉందట. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ స్టైల్‌కి తగ్గట్టుగా వుంది  ఈ ఇంటికి ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక సోషల్‌ మీడియాలో కూడా విజయ్‌ చర్చ మొదలైంది.నెటిజన్లు  విజయ్‌పై  ఇల్లు కొన్నావ్‌ సరే.. మరి పెళ్లి ఎప్పుడు అంటూ  కామెంట్‌ చేస్తున్నారు. 

 

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. అందరి దృష్టిలో ‘పెళ్లి చూపులు’ అనే సినిమాతో  మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత  'అర్జున్ రెడ్డి’ సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో తన మార్కెట్‌ను అంచెలంచెలుగా పెంచుకున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా దుస్తులకు సంబంధించి ఓ బ్రాండ్‌ సృష్టించారు. ఇక ప్రకటనల రూపంలో కూడా విజయ్‌ బాగానే సంపాధిస్తున్నాడు. పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

 

తాజాగా ఈ ఇంట్లోకి  శాస్త్రోక్తంగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి గృహ ప్రవేశం చేసాడు. ఈ ఆనందకరమైన విషయాన్ని విజయ్.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం విజయ్  దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేసాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: