‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ఆ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరంజీవి. ఆయన మాటల్లో ఈ మధ్య బాగా చమత్కారం కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ వెండితెరపై తన నటనతో, హావభావాలతో, డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిరంజీవి.. ఇప్పుడు బయట ఫంక్షన్లలో కూడా అదే ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. ఇటీవల  ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి తన చమత్కారం, పంచ్ డైలాగులతో అదరగొట్టారు. అలాగే, ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా ఆసక్తికరంగా మాట్లాడారు.

 

ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చే సిన మెగాస్టార్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికరంగా ఉక్యాలు చేశారు. అయన మాట్లాడుతూ.. ‘‘ఒక విషయం చెప్పేస్తాను ఏమనుకోకు.. నీ నవ్వంటే ఇష్టం నాకు. ఆ చొట్టబుగ్గలు.. డింపుల్ భలే ఉంటుందిలే. మారుతి సినిమాలో లావణ్యను కళ్లు ఆర్పకుండా చూశానని అయన తెలిపారు. ఆ సినిమాలో మారుతి లావణ్యను బాగా చూపించారని, ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. నాలాంటోడు కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టు ఎక్కుతుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి చాలా హెల్ప్ జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

 

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు తాను రావడం చాలా మందికి ఆశ్చర్యంగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు చిరంజీవి. ‘‘ఇంత వరకు నేను ఈ హీరోను కలుసుకుంది, చూసింది లేదు. ఫస్ట్ టైమ్ మొన్న ప్రీమియర్ చూస్తున్నప్పుడు చూశానంతే. ఠాగూర్ మధు నన్ను ఫంక్షన్‌కు రమ్మని ఇబ్బంది పెట్టేంత ప్రయత్నం చేయడు. నేను చాలా బిజీగా ఉంటాను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుంటాడు. మరి ఇక్కడికి ఎవరి ప్రమేయంతో వచ్చానని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ప్రీమియర్ షో చూసిన తరవాత నాకు నేనుగా రావాలని కోరుకున్నాను’’ అని చెప్పారు చిరంజీవి.

 

‘అర్జున్ సురవరం’ ప్రజల్లోకి వెళ్లాల్సిన సినిమా అని, ఇలాంటి మంచి సినిమా గురించి కచ్చితంగా ప్రచారం చేయాలని, ప్రేక్షకులకు తెలియజేయాలని చిరంజీవి అన్నారు. అందుకే, ఈ చిత్రానికి తనవంతుగా ప్రచారం కల్పించడానికి ఈ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటుచేయమని చెప్పానని వెల్లడించారు. అయితే, తనను వాడుకోవడానికి కూడా నిర్మాత రాజ్ కుమార్ మొహమాటం పడ్డారని సరదాగా అన్నారు మెగాస్టార్. ‘‘ఇలాంటి వాడు ఆడపిల్ల అయితే చాలా ప్రమాదం కదా. థ్యాంక్ గాడ్ మగాడిగా పుట్టాడు’’ అని నిర్మాత రాజ్ కుమార్ మొహమాటంపై సరదాగా మాట్లాడారు చిరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: