ఆయన సినిమా ఒక వివాదం ఆయన ట్విట్  ఒక సంచలనం...ఆయన  ఎవరో కాదు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. వివాదాస్పద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసిన దర్శకుడు వర్మ .ఈ  దర్శకుడు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేసాడు అంటే రామ్ గోపాల్ వర్మ నుండి వివాదం లేకుండా ఏదైనా  సినిమా వస్తుందంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేనంతగా  ప్రభావితం చేసారు. రాంగోపాల్ వర్మ సినిమా అంటే అందులో వివాదం ఉండాల్సిందే దానికోసం రచ్చ  జరగాల్సిందే అన్నది ప్రస్తుతం ప్రేక్షకుడు  భావన కూడా . ఇక అటు రాంగోపాల్ వర్మ కూడా మామూలు సినిమాల జోలికి అస్సలు పోడు  ఆయన సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే ఒక రేంజ్ లో ఉన్న వివాదం ఉండాలి.... ఆ సినిమా  ఒక రేంజ్లో కాంట్రవర్సీ సృష్టించేలా  ఉండాలి అలా అయితేనే వర్మ  సినిమా తీయగలరు. 

 

 గతంలో 2019 ఎన్నికల ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు ఎన్టీఆర్ ను  ఎలా  వెన్నుపోటు పొడిచారో అసలు నిజాలు  చెబుతాను అంటూ సినిమాను తెరకెక్కించాడు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించి ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇక ఇప్పుడు వర్మ  మరో ఒక సినిమాకు తెరలేపిన విషయం తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరమీదికి తెచ్చాడు  రామ్ గోపాల్ వర్మ. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామాలను వ తన సినిమాల్లో చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే విడుదల చేసిన సినిమా ట్రైలర్ లో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా రాజకీయాల్లోనే ముఖ్య నేతలందరి  పాత్రలను విడుదల చేశారు. అంతేకాకుండా కేంద్రంలోని మోదీ అమిత్ షా  పాత్రలను కూడా వదలలేదు రాంగోపాల్ వర్మ. 

 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రఖ్యాతిగాంచిన తండ్రి కొడుకులకు అంకితం ఇస్తున్నాను అంటూ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అయితే ఒకరిని టార్గెట్ చేస్తూ ఈ  సినిమా తీయలేదని ఆంధ్ర  రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసినట్టు తెలిపాడు. మీడియా సమావేశంలో కేఏ పాల్ ఫిర్యాదు పై మీ స్పందన ఏమిటి అంటూ ఎదురైన  ప్రశ్నకి ... కెఏ పాల్ నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశా అంటూ సమాధానమిచ్చాడు సెన్సేషనల్ దర్శకుడు వర్మ.  ఆంధ్ర రాజకీయాల్లో జరిగిన జరుగుతున్న జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన సినిమాను తెరకెక్కించినట్లు పడుతున్నారు. ఆంధ్ర రాజకీయ పరిణామాలు తనకు ఆసక్తి కలిగించాయి కాబట్టి ఆ విషయాన్ని సినిమాలు చూపించబోతున్నాను  అని వర్మ క్లారిటీ ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: