ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో చాలా బీజీగా ఉన్నారు . ఈ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో  వారి  మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు.  వీరి వివాహం 2018 డిసెంబర్‌ 1న  అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు.

 

ఈ సందర్భంగా న్యూయార్క్‌ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు ఆమె బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.  ఓ కుక్కపిల్లను ఆమె నిక్‌ జొనాస్‌కు గిఫ్ట్ ఇచ్చారు   ఈ కుక్క పిల్ల జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందినది . అప్పుడే దీనికి ‘గినో’ గా  పేరు కూడా పెట్టేశారు. ఇందుకు ప్రియాంక  నిక్‌ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక దీనిని  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్‌  కూడా ఇచ్చారు. 

 

ఇ​క దీనిపై స్పందించిన నిక్‌...‘ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్‌ చెప్పండి.  నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక’ అంటూ నిక్‌  తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ఉంది. దీనిని 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు.

 

దీని పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ కూడా ఉందంటే ప్రియాంకు డయానా అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. తాజాగా గినోను ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో డయానాను కూడా మేము ప్రేమిస్తున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఇక మొదటి పెళ్లిరోజు దగ్గరపడుతుండటంతో ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిలో ప్రియాంక, నిక్‌ కపుల్‌ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోబుతున్నాము  అని తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: