టెక్నాలజీ పుణ్యమా అంటూ చాలా అడ్వాన్స్ అయిపోతున్న ప్రపంచంలో క్లిక్ చేస్తే తినే ఆహారాలు మన దగ్గరికి వస్తున్నా యుగంలో..సమాజంలో డిజిటల్ ప్రపంచంలో మనిషి తన సుఖం కోసం వికృత చేష్టలకు పాల్పడుతూ సమాజానికి మృగంలా మారుతున్నాడు. ముఖ్యంగా ఫోర్నోగ్రఫీ కి అలవాటు పడుతూ చేయరాని పనులు చేస్తూ వావివరసలు లేకుండా ఎవరితో పడితే వారితో అసభ్యంగా వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ రెచ్చి పోతున్నాడు. దేశంలో నిర్భయ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా తాజా ప్రపంచంలో మాత్రం రోజుకో ఘటన నిర్భయ కంటే దారుణంగా జరుగుతున్న ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు శిక్షలు అమలు చేస్తున్న మనిషి ఆలోచనలో మాత్రం మార్పు రావటం లేదు.

 

ముఖ్యంగా ఫోర్నోగ్రఫీ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ స్మార్ట్ ఫోన్ ద్వారా చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి రావడంతో చిన్న వయసులోనే వికృత చేష్టలకు పాల్పడుతూ తమ శరీరాలను అదుపు చేసుకోలేక నీచమైన పనులు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడటం వల్ల చాలామంది దాంపత్య జీవితాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలు తెచ్చుకుంటూ కుటుంబాలు కూల్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది యువతీ యువకులు పెళ్లి కాకముందే ఫోర్నోగ్రఫీ వీడియోలు చూస్తూ వాటికి అలవాటు పడుతూ తమ బంగారు జీవితాలను పెళ్లి కాకముందే నాశనం చేసుకుంటున్నారు.

 

ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు ఫోర్నోగ్రఫీ ఇంటర్నెట్లో బ్యాన్ చేయాలనీ భావించిన టెక్నాలజీ పుణ్యమా ఏదోవిధంగా ఫోర్నోగ్రఫీ చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో… ఉన్న యువతీ యువకులు, వృద్ధులు అన్ని వయసుకు సంబంధించిన వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఫోర్నోగ్రఫీ కి సంబంధించిన వెబ్ సైట్ విషయాలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే న్యాయస్థానాలు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో సమాజానికి మరింత ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు బట్టి తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: