టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.  సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని ఎన్నో కాంట్రవర్సీ సినిమాలు ఆయన తీశారు. ఆ మద్య ఏపీలో ఎన్నిక సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.  మొదటి నుంచి వర్మ ఒకే విషయం చెబుతూ వస్తున్నారు..తనకు కాంట్రవర్సీలంటే ఎంతో ఇష్టం.. అందుకే ఆ తరహా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానంటున్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ని రాజకీయంగా వెన్నుపోటు ఎవరు పొడిచారు..ఆయన పొలిటికల్ కెరీర్ చిన్నాభిన్నం అయ్యింది అనే కాన్సెప్ట్ పలువురు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.  అప్పట్లో ఈ మూవీని బహిష్కరించాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.  

 

మొత్తానికి ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవడం... ఎన్నికలు అయ్యేవరకు మూవీని నిలిపివేయడం జరిగింది.  కాకపోతే ఏపిలో మాత్రమే.. ఇతర రాష్ట్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కావడం సెన్సేషన్ సృష్టించడం జరిగింది. తాజాగా మరో సంచలనానికి నాంది పలికారు రాంగోపాల్ వర్మ. ఏపిలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో నిర్మించిన విషయం తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించిన రెండు ట్రైలర్స్ వర్మ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్స్ చూసిన వారు..మూవీ వల్ల రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణకు దారితీసే ప్రమాదమున్నందున దీని విడుదలను నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.  అంతే కాదు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ మూవీ విడుదలను నిలిపేయాలని ఇంద్రసేన చౌదరి సెన్సార్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. 

 

వర్మపై కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈ మూవీ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందించారు.  ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని అన్నారు. ఈ మూవీలో ఏ ఒక్క సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ క్రైమ్స్ కన్నా పొలిటికల్ క్రైమ్ కే ఆడియన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ సినిమాను ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తానని చెప్పారు. ఇక తనకు చిన్నప్పటి నుంచి తనకు గిల్లుడు అలవాటని చెప్పారు. అందుకే ఈ తరహా కాంట్రవర్సీ మూవీలకు ప్రాధాన్యత ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: