మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోరు మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ తేజ్ తాజాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మాస్ ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా హిట్‌తో వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ పెరిగింది. దీంతో తన రెమ్యునరేషన్‌ను కూడా వరుణ్ భారీగా పెంచేసినట్టు ఇండస్ట్రీ టాక్.

 

 

ఇకపోతే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటున్న యువ కథానాయకులలో వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. నిన్నమొన్న వచ్చిన ఎఫ్ 2 వరకూ 5 కోట్లకి పైగా పారితోషికం తీసుకున్న వరుణ్ తేజ్, తదుపరి సినిమా కోసం 10 కోట్లు అందుకున్నాడని అంటున్నారు. త్వరలో ఆయన కిరణ్ కొర్రపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన ఈ మొత్తం పారితోషికం తీసుకున్నాడని చెబుతున్నారు. ఇకపోతే పారితోషికం పరంగా నాని.. విజయ్ దేవరకొండల స్థాయికి వరుణ్ తేజ్ సైలెంట్ గా చేరిపోవడం గురించి చెప్పుకుని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

 

ఇదే కాకుండా లా వరుస హిట్లు పడటం వరుణ్‌ కు ఒకరకంగా కలసి వచ్చింది. అందుకే ఈ హీరోతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారట. వరుణ్ రెమ్యునరేషన్ పెంచేసినప్పటికీ నిర్మాతలు బయపడటం లేదని, అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే వరుణ్‌తో సినిమా అంటే హిట్టు గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలుగజేశారని అంటున్నారు.

 

 

ఇక చూద్దాం వరుణ్ తేజ్ తన మార్కెట్‌ రేంజ్‌ను ఎక్కడ వరకు పెంచుకుంటూ వెళ్తారో అని అనుకుంటున్నారట కొందరు నిర్మాతలు, సినీ వర్గాలవారు. ఇక తాజాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందట. ఇందుకుగాను బాక్సింగ్‌లో శిక్షణ కోసం ఇప్పటికే వరుణ్ ముంబై వెళ్లారు. ఇకపోతే తన కెరీర్‌లో తొలిసారి బాక్సర్‌గా నటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: