కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు సోషల్ మీడియాను కూడా ఒక రేంజ్ లో ఊపేస్తున్న  సినిమా.విడుదలకు  ముందే సంచలనాలు సృష్టిస్తున్న   సినిమా. మామూలుగానే రాంగోపాల్  వర్మ  సినిమాలంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వర్మ ఏ సినిమా తెరకెక్కించిన అందులో వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వివాదాలు లేనిది  వర్మ లేడు...వర్మ లేనిది   వివాదాలు లేవు అన్నట్లుగా ఉంటుంది. అందుకే అందరూ వర్మ ను వివాదాల దర్శకుడు అని పిలుస్తుంటారు. ఎన్నో వివాదాల సినిమాలను తెరకెక్కించారు రాంగోపాల్ వర్మ. అయితే ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆంధ్ర రాజకీయాలలో అలజడి సృష్టించారు రాంగోపాల్ వర్మ. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగివచ్చి రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపేసేంత   ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసాడు. 

 


 ఇక ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు తెరలేపారు రాంగోపాల్ వర్మ. ఇందులో కూడా వివాదాలను గట్టిగానే నూరి  పోసినట్లు కనిపిస్తోంది. అయితే ఆంధ్ర రాజకీయాల్లో 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు అన్నింటిని తన సినిమాల్లో చూపించబోతున్నట్లు సమాచారం ఇచ్చారు. ఇక తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఆంధ్ర రాజకీయాల్లో జరిగిన జరుగుతున్న  జరుగబోయే  పరిణామాలను తన సినిమాలో ఉంటాయని తెలిపారు. అయితే ఈ సినిమా ఆంధ్ర రాజకీయాల్లోనీ అన్ని పరిణామాల గురించి తెరకెక్కిస్తున్నాను  అని చెప్పినప్పటికీ... ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా  చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ లో బాబు కు సంబంధించి  ఎక్కువగా చూపించారు . 

 


 అంతేకాకుండా టిడిపి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై పప్పు లాంటి అబ్బాయి అనే పాటను కూడా విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ.ఇక తాజా  మీడియా సమావేశంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రఖ్యాతి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులకు అంటూ అనటం  ఆసక్తికరంగా మారింది . అంతేకాకుండా వర్మ విడుదల చేసిన ట్రైలర్ లో బుడ్డోడు  పార్టీ ని లాగేసుకుంటే  అనే డైలాగ్ను పెట్టాడు. వర్మ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీని  చంద్రబాబు నుంచి లాగేసుకుని పరిణామాలను ఏమైనా చూపిస్తాడా  అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వర్మ ఏం చెప్పబోతున్నారో  ప్రేక్షకులకు క్లారిటీ లేదు కానీ వర్మ  ఏం చెప్పినా అది వివాదంగా మారుతుందని మాత్రం ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: