ఈమధ్య కాలంలో స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లు ప్రీరిలీజ్ వేడుకల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తూ ఆ  ఫంక్షన్స్ ను అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తూ ఈ మూవీలకు క్రేజ్ పెంచి భారీ ఓపెనింగ్స్ కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ‘సాహో’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అదేవిధంగా ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కోసం ఖర్చు చేసిన భారీ మొత్తాలతో ఒక చిన్న సినిమా తీయవచ్చు అన్న కామెంట్స్ వచ్చాయి. 

‘సాహో’ ఫంక్షన్ కోసం ప్రభాస్ అభిమానులు ‘సైరా’ ప్రీ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు వేలాదిగా రావడమే కాకుండా అలా  వచ్చిన అభిమానులతో స్టేడియమ్ లు కిక్కిరిపోయాయి. పాన్ ఇండియా మూవీలు అంటూ ప్రభాస్ చిరంజీవిలు చేసిన హంగామాతో ఇండస్ట్రీ దద్దరిల్లి పోయింది. ఇప్పడు నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ ఈవెంట్ కు బాలకృష్ణ ప్రభాస్ చిరంజీవిల అడుగుజాడలలో అనుసరించ బోతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి.    

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రూలర్’ మూవీకి సంబంధించి నిర్మాణా అనంతర పనులు  చాలా వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 20న విడుదలకాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భాగ్యనగరంలో అత్యంత భారీగా చేయాలని ఈ మూవీ నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చి నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ 15న అత్యంత భారీగా ఈమూవీ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది. 

సరిగ్గా రిలీజ్ కి ఐదు రోజుల ముందు ఈవేడుకను  నిర్వహించడంతో ఈమూవీకి భారీ క్రేజ్ ఏర్పడుతుందని ఈమూవీ యూనిట్ ప్లాన్ అని అంటున్నారు. ఈ వేడుకకు వేలాదిగా నందమూరి అభిమానులు వస్తారని ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈఏడాది విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత ఎన్నికలలో తెలుగుదేశం ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన తన అభిమానులకు జోష్ ను కలిగించడానికి బాలయ్య సూచనతో ఈభారీ ప్లాన్ కు రూపకల్పన జరిగింది అని అంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: