ఇంద్ర సినిమాలో  మెగాస్టార్  చిరంజీవి వేసిన వీణ  స్టెప్పు ఎంతలా ఫేమస్ అయ్యిందో  మనకు తెలిసిందే. ఈ స్టెప్పును  చాలా మంది  ట్రై చేశారు కానీ చిరు  చేసినట్లు  ఎవరు చేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో ఈ స్టెప్పును  తన  కొత్త  సినిమాలో  రీ క్రియేట్ చేస్తున్నాడు.  అయితే అతను  తెలుగు హీరో కాదు..  బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్. 
 
ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 లో  ఈ  ఐకానిక్ వీణ స్టెప్పును  రీ క్రీయేట్ చేస్తున్నాడు.  అందులో భాగంగా   'మున్నా బదనాం హువా' అనే సాంగ్ లో  సల్మాన్ ఈ వీణ స్టెప్పును  వేయనున్నాడు.   ఇక ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను  పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్  సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.  
 
 
ప్రముఖ  కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్  ప్రభుదేవా తెరకెక్కిస్తున్న  ఈచిత్రంలో  సోనాక్షి సిన్హా  హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ చిన్న  కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది.  వీరితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ హిట్ సిరీస్ దబాంగ్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంఫై  భారీ అంచనాలు వున్నాయి. సాజిద్ -వాజిద్  సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  నిర్మిస్తున్నారు . క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 20న ఈ చిత్రం  హిందీతో పాటు తెలుగు , తమిళ  భాషల్లో  విడుదలకానుంది. ఇక   అన్ని భాషలకు కలుపుకొని ఈచిత్రం యొక్క  శాటిలైట్ హక్కులను  జీ నెట్వర్క్  80కోట్లకు  సొంతం చేసుకోగా  డిజిటల్ హక్కులను  అమెజాన్ ప్రైమ్ 60కోట్లకు దక్కించుకుంది. అలాగే మ్యూజిక్  రైట్స్ ను టీ  సిరీస్  15కోట్లకు   సొంతం చేసుకుంది. అలా ఈ చిత్రం  150కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: