ఈరోజుల్లో ఆడవారిపై లైంగిక దాడులు మరీ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఆడవారికి అనుగుణంగా వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయినా రోజురోజుకీ ఈ తరహా దారుణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక లాజిక్ లేని విషయాన్ని ఒక సీనియర్ సినీ దర్శకుడు సభాపూర్వకంగా చర్చించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ములాయం యాదవ్ నుండి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ వరకు ఎంతోమంది ఇలా మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేయగా అమ్మాయిలకు ఎందుకు రేప్ కు గురవుతారు అన్న విషయంపై తమిళ సినీ డైరెక్టర్ భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

 

అసలు అమ్మాయిలు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది...? అసలు ఏమి మాట్లాడుతారు అంటూ భాగ్యరాజ్ నేరుగా మహిళలు ప్రశ్నించడం గమనార్హం. అదే విధంగా ఈ సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి నేరాల విషయంలో ప్రతిసారి అబ్బాయిలను నిందించడం తగదు అని అన్నాడు. ఇదంతా అతను 'కరుతుకలై పథివు సై' అనే తమిళ సినిమా ఆడియో లాంచ్ లో మాట్లాడటం జరిగింది. ఈ సినిమాను పొల్లాచిలో సెక్స్ స్కాండల్ పైన నిర్మించగా అతను మాత్రం అక్కడ మాట్లాడిన మాటలు చాలా విరుద్ధంగా ఉన్నాయి.

 

ఇంకా ఈ సీనియర్ డైరెక్టర్ ఏమన్నాడంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఫోన్ లలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని అని.. అలా అబ్బాయిలకు తమకు నచ్చింది చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారని అన్నాడు. కాలం మారేకొద్దీ పరిస్థితులు మారుతున్నాయని... అంతకుముందు ఆడవారికి ఆంక్షలు ఉన్న సమయంలో ఇటువంటి నేరాలు జరిగే కాదని అంతా సవ్యంగానే ఉండేదని ఆయన అన్నాడు. చిత్రంగా ఈయన చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఉన్న జనమంతా చప్పట్లు కొట్టి అభినందించడం విశేషం. అలాగే సూది అనుమతి లేకుండా దారం దానిలోనికి దూరడం అసాధ్యమని పాత తమిళ సామెతను కూడా వల్లించిన ఇతనిని సోషల్ మీడియాలో విపరీతంగా దుమ్మెత్తిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: