బాలీవుడ్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ కు ఉన్న క్రేజ్ ఇంకెవరికీలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరోయిన్ అయి ఉండి కూడా ఇంకా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొత్త తరం హీరోయిన్ల కు గట్టి పోటీ ఇస్తూ అసూయ కలిగేలా చేస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ.. సోషల్ మీడియాలో జనాలకు హీటెక్కించే విషయంలోనూ కత్రినా ఎవరికీ తక్కువకాదు. కత్రినా ఫోటో ఏదైనా ఒకటి బయటకు వస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంది.

 

ఈ మధ్య కత్రినా సముద్ర ప్రయాణం చేస్తూ ఒక అందమైన శ్వేత వర్ణపు పడవలో అలా నడుస్తూ రెండు ఫోటోలు తీయించుకుంది. బ్లాక్ కలర్ డిజైన్ ఉండే ఒక లైట్ కలర్ బికినీ ధరించి గ్లామర్ ని, అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది. అంతేకాదు రొమాంటిక్ లుక్స్ తో పిచ్చ హాటుగా కనిపిస్తోంది. కత్రినా మొదటి నుంచి సూపర్ ఫిట్ గా ఉండే బ్యూటి. పైగా పొడవు కాళ్ళ సుందరి అని పేరు. అందుకేనేమో కత్రినా తన కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది. ఇక సముద్రం బ్యాగ్డ్రాప్ లో ఉన్న ఈ ఫోటో లో ఎంతో గ్లామర్ గా కనిపిస్తోంది.

 

నిజాకి అందంగా చాలామంది ఉంటారు కానీ దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ ఉండదు. కానీ కత్రినా దగ్గర ఆ స్టైల్, బాడీ లాంగ్వేజ్, గ్లామర్ టన్నులలో ఉంది. అందుకే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సూట్ అవుతుంది. అది చీర అయినా.. చుడిదార్ అయినా.. ప్యాంట్ షర్టు అయినా.. స్కర్ట్ అయినా.. లేక బికినీ అయినా. అందుకే కత్రినా క్రేజ్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో అసలు యాక్టింగే రాదు అన్న విమర్శలు ఎదుర్కున్న కత్రినా ఇలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులర్ అవడం విశేషం. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ నటిస్తున్న 'సుర్యవంశి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: