సౌత్ లోనే బిగ్ బాస్ షో హోస్టుకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో పోలిస్తే హిందీ హోస్టుకు భారీ రెమ్యూనరేషన్ ముడుతూ ఉంది. బిగ్ బాస్ హోస్టుగా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రతి ఏడాదీ ఒక కొత్త సినీ హీరో ఆ షోను హోస్టు చేస్తూ ఉన్నాడు. ముందు తారక్, తర్వాత నేచురల్ స్టార్ నాని..ఇక సీజన్ 3 కి అక్కినేని నాగార్జున. హిందీ వెర్షన్ విషయంలో కూడా మొదట్లో హోస్టు మారారు. అయితే సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాకా మళ్లీ ఏ మార్పు లేదు!

 

సల్మాన్ ను హిందీ బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు అస్సలు వదలడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు పదమూడో సీజన్ నడుస్తూ ఉంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్లను పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే సల్మాన్ అందుకు ముందు కుదరదంటే కుదరదన్నట్టుగా బాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్. తనకు వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో..ఈ షోను ముందుగా అనుకున్న సమయానికే కంప్లీట్ చేయాలని సల్మాన్ టీం తో స్పష్టం చేశారట. అయితే ఆయనను చల్లబరచడానికి, తమకు మరిన్ని డేట్స్ కేటాయించేందుకు భారీ పారితోషకాన్ని అందించడానికి రెడీ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఐదు వీకెండ్స్ షూటింగ్స్ కోసం మొత్తం రెండు కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట. 

 

దీంతో వేరే కమిట్ మెంట్స్ ను కూడా వాయిదా వేసుకుని, బిగ్ బాస్ షోకు సమయం కేటాయించడానికి సల్మాన్ ఓకే చెప్పినట్టుగా తాజా సమాచారం. పది ఎసిసోడ్స్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల పారితోషకం అంటే.. ఇది ఏ రేంజ్ రెమ్యూనరేషనో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, కన్నడ, తమిళ బిగ్ బాస్ హోస్టులకు మాత్రం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ లేవన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే సల్మాన్ ఇక్కడ ఒక స్ట్రాటజీని వాడాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎటు షో మధ్యలో ఉంది కాబట్టి తప్పుకుంటానంటే రేటింగ్ పోతుంది కాబట్టి తననే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి బ్రతిమాలతారని తెలిసే కుదరదని చెప్పినట్టుగా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: