గత కొంత కాలంగా మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ ట్రెండ్ నడుస్తుంది. అందుకు కారణం సొంతగా కథలు రాసే దర్శకులు లేకపోవడం ఒకటైతే... ఏదో ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమాని కొనుక్కొని రిస్క్ లేకుండా రీ మేక్ చేయడం. ముఖ్యంగా తమిళ సినిమాలను ఇప్పుడు ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులకు తెలిసి కొన్ని రీమేక్స్ జరుగుతుంటే మరికొన్ని ప్రేక్షకులకు తెలియకుండా స్ట్రైట్ సినిమాగా తెరకెక్కుతున్నాయి. మరి ఇదేం స్ట్రాటజీనో ఆ సినిమా తీసేవాళ్ళకే తెలియాలి. ఇక అలాంటి రీమేక్ లో ఒకటి 'ఎంత మంచి వాడవురా'. వాస్తవానికి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గుజరాతి 'ఆక్సిజన్' సినిమాకు రీమేక్ అని లేటెస్ట్ న్యూస్.

 

అయితే ఈ విషయాన్ని ఇంత వరకూ ఈ సినిమా యూనిట్ ఎక్కడా రివీల్ చేయకుండానే సైలెంట్‌గా షూట్ పూర్తి చేసారు. అయితే 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రీమేక్ అని ఇప్పటివరకు చెప్పకపోవడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందట. అదేంటంటే ఆక్సిజన్ కథను చాలా వరకూ మార్చి సతీష్ వేగేశ్న తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త సన్నివేశాలు రాసుకున్నాడట.

 

ఆల్మోస్ట్ సినిమాలో యాబై శాతం మాత్రమే ఒరిజినల్ సన్నివేశాలుంటాయట. అందుకే ఈ సినిమాను పూర్తి రీమేక్ గా ప్రకటించకుండా స్ట్రైట్ సినిమాలా ప్రాజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఈ మధ్య రీమేక్ సినిమాలు మక్కీ కి మక్కీ దించేస్తూ పైకి సోల్ మాత్రమే తీసుకున్నాం.. అని చెప్పడం చాలా కామన్ అయింది. మరి సతీష్ కూడా అదే కోవలోకి వస్తాడా నిజంగానే కథలో మార్పులు చేసాడా..అన్నది ఈ సంక్రాంతికి తేలిపోతుంది. కానీ ఏదేమైనా అంతమంచి టైటిల్ పెట్టి ఇలాంటి పని చేశారేంటని నెటిజన్లు ఈ విషయం తెలిసినప్పటి కామెంట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు..రెండవది అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో. మధ్యలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ కూడా దిగుతోంది. మరి ఈ సినిమాలని కళ్యాణ్ రామ్ తట్టుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: