సినిమాలు వేరు రాజకీయాలు వేరు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలు ఇంకా వేరు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎలాంటి రచ్చలు ఎవరి వల్ల జరుగుతాయో కూడా చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు జరుగుతున్నాయని ఎవరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ‘‘మా’’ ఎన్నికలు జరుగుతున్న పద్దతిని ఈ మధ్య చూస్తున్నదే. ఈ మధ్యన జరిగిన ఎన్నికల అనంతరం మా అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ ఎన్నిక కావటం.. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారే తప్పించి.. అసోసియేషన్ పనుల్లో యాక్టివ్ గా లేరన్న విమర్శల్ని ఎదుర్కున్నారు. 

 

ఇండస్ట్రీలో ఎవరైనా సరే.. వారి తప్పుల్ని ఎత్తి చూపించే విషయంలో జీవితా రాజశేఖర్లు అస్సలు తగ్గరన్న సంగతి తెలిసిందే. ఇటీవల నరేష్ మీద విమర్శలు చేసిన ఈ జంటకు చెక్ పెట్టేలా తాజాగా నరేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విడుదలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.  మా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవటానికి తాను ఈ క్షణం కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పి అందరికి షాకిచ్చారు. అయితే.. తనను ఎవరూ బయటకు పంపలేరని వ్యాఖ్యానించారు. తాను సభ్యుల ఓట్లతో అధ్యక్షుడ్ని అయినట్లు చెప్పుకున్న నరేష్.. తనకు ‘మా’ లో శత్రువులు ఎవరూ లేరంటు క్లారిటి ఇచ్చారు.

 

తమది రాజకీయ పార్టీ కాదని.. సేవా సంస్థగా భావించాలన్న ఆయన.. చిరంజీవి.. కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి పెద్దల సహాయ, సహకారాలతో అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నట్లు నరేష్ తెలిపారు. అలాంటి సమయంలో వివాదాలకు తావిచ్చేలా.. ఎదుటివాళ్ళు హర్ట్ అయ్యోలా వ్యాఖ్యలు చేయడం ఎందుకు నరేష్ అన్న ప్రశ్న రాక మానదు. తను అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్నెల్ల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టినట్లుగా నరేష్ వ్యాఖ్యానించారు. నరేష్ తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఇలాంటి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొనే జీవితా రాజశేఖర్ చేతికి.. నోటికి పని చెప్పినట్లు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మా లో ఈ గోలలు..రచ్చలు శరా మామూలే అని. వీటికి పూర్తిగా అరికట్టే సమయం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇది మెగాస్టార్ పూర్తిగా ఇన్వాల్వ్ అయితే గాని సాధ్యపడని విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: