కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.. 2018 లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకున్న పార్టీ.  కానీ, కొన్ని కారణాల వలన కాంగ్రెస్ పార్టీ, జీడీఎస్ తో పొత్తు పెట్టుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలని అనుకుంది.  అనుకున్నట్టుగా అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత 13 నెలల పాటు అధికారంలో ఉన్నది. అయితే, మొదట్లో కాంగ్రెస్, జీడీఎస్ పార్టీల మధ్య సయోధ్య నడిచింది.  కానీ, ఆ తరువాత మెల్లిగా ఒక్కొక్కటిగా మార్పులు జరిగాయి.  
ఈ మార్పులకు కారణం ఏంటి ఎందుకు ఇలా జరిగింది.. అని చూస్తే..  ఎన్నో కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది.  కుమారస్వామి ఏదైనా కొన్ని పనులు చేయాలి అనుకుంటే.. దానిని పక్కదోవ పట్టించే  ప్రయత్నాలు చేసింది. కలిసుంటునే గోతులు తవ్వింది.  గతంలో జేడీఎస్, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో జేడీఎస్ పార్టీ మొదట ముఖ్యమంత్రి పదవిని అనుభవించి, రెండేళ్ల తరువాత యడ్యూరప్పకు అప్పగించకుండా ప్లేట్ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.  
మరలా ఆలా చేస్తుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆలా చేసింది.  ఇది జేడీఎస్ కు సుతనా నచ్చలేదు.  దీంతో కాంగ్రెస్ పార్టీపై డైరెక్ట్ గా ఫైట్ చేసింది.  ఏదైతేనేం చివరకు అక్కడ పార్టీ ఓటమిపాలైంది.  బీజేపీ అధికారంలోకి వచ్చింది.  అయితే,మండ్యలో జరిగిన ఉప ఎన్నికలో కుమారస్వామి తన కుమారుడిని అక్కడి నుంచి పోటీకి నిలబెట్టాడు.  సుమలత భర్త అంబరీష్ మరణం తరువాత ఆమె అక్కడి నుంచి పోటీ చేసింది. 
అయితే, సుమలతకు బీజేపీ సపోర్ట్ చేసింది.  దీంతో ఆమె అక్కడ విజయం సాధించింది. అయితే, ఇప్పడు మండ్య ప్రాంతంలోని కెఆర్ పేటలో ఉపఎన్నిక ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.  తన కొడుకును అక్కడి నుంచి ఓడించారని ఫీలయ్యాడు.  ఎందుకు ఫీల్ కావాల్సి వచ్చిందో తెలియదు.  గెలుపు ఓటములు సహజమే కదా.  కానీ అయన అలా ఏడవడంతో అక్కడ ఉన్న వళ్ళంతా షాక్ అయ్యారు.  
తన కుమారుడు నిఖిల్ గౌడను అక్కడి నుంచి పోటీ చేయించాలని అనుకోలేదని, కానీ, అక్కడి ప్రజలు పట్టుబట్టడం వలనే పోటీకి నిలబెట్టానని, కానీ, అదే ప్రజలు తన కొడుకును ఓడించారని అన్నారు.  తన కొడుకు ఓడిపోయినందుకు బాధగా లేదని, సీఎం పదవి పోయినందుకు బాధగా లేదని, కానీ, ప్రజల గురించే తనకు బాధగా ఉందని అన్నారు.  ప్రజలు గురించి అయన ఎందుకు అంతగా బాధపడుతున్నారో తెలియడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: