సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత నాగార్జున కి ఒక్క హిట్ కూడా మళ్ళీ పడలేదు. నానీ తో చేసిన దేవదాస్ కూడా భారీ పరాజయాన్నే మూటగట్టుకుంది. ఇక ఎన్నో అంచనాలతో ‘మన్మథుడు 2' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున డిజాస్టర్ ను నెత్తిమీద పెట్టుకున్నాడు. అనవసరం గా మన్మథుడు సినిమాకి సీక్వెల్ అని ఆ సినిమా పరువు కాస్తా తీసిపారేశారు. వయసుకు తగ్గ పాత్ర ఎంచుకోకపోవడంతో ముదురు హీరో అని చెప్పక తప్పలేదు. ఎంత ఫుల్ ఫిట్ గా ఉన్నప్పటికి - ఆయన వయసు రిత్యా సీనియర్ హీరో అయిపోయినట్టే. అయితే టాలీవుడ్ మన్మథుడుని అనుకుంటు హీరోగా ఇంకా నాగ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇమేజ్ విషయాలను పక్కన పెట్టి..ఎప్పుడు నాగార్జున ప్రయోగాలకూ రెడీ అంటూనే ఉంటారు. అంతేకాదు ఎక్కువ శాతం కొత్త దర్శకులకే అవకాశం ఇస్తుంటారు.

 

ఈ నేపథ్యంలో నాగార్జున పోలీసాఫీసర్ గా ఒక సినిమాలో నటించబోతున్నారు. సాల్మన్ అనే కొత్త దర్శకుడికి నాగార్జున ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ అంటూ పోలీస్ గా కనిపించి ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నాడు నాగార్జున. అయితే ఈ సారి కూడా పోలీసాఫీసర్ గా నటించి హిట్ కొట్టాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది. సాల్మన్ దర్శకత్వంలో నాగ్ పోలీసాఫీసర్ గా నటించడం ఒక విశేషం అయితే - ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటం మరో ఆసక్తికరమైన విషయం.

 

ఇప్పుడు సీనియర్ హీరోలకు మాత్రమే జోడీగా నటిస్తున్న కాజల్ గతంలో నాగచైతన్యకు జోడీగా నటించింది. ఇప్పుడు ఆయన తండ్రి నాగార్జునకి జోడీగా నటిస్తూ ఉంది. మెగా ఫ్యామిలిలో కూడా ముందు రామ్ చరణ్ సరసన నటించిన కాజల్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ 150 లో నటించింది. ఇప్పుడు అలానే- చైతూ తండ్రి సరసన నటిస్తూ ఉంది. ఇండస్ట్రీలో తండ్రీ కొడుకులతో నటించిన హీరోయిన్ గా కాజల్ కి మంచి పేరు సంపాదించుకుంది. ఇక కాజల్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తేజ సీత కూడా కాజల్ కి షాకిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: