సౌత్ సినిమా ఇండస్ట్రీలో డాన్స్ పరంగా మెగాస్టర్ కి ఉన్న ఇమేజ్ గాని స్టార్ డం గాని అసాధారణం. ఆయన డాన్స్ కోసమే జనాలు థియోటర్స్ కి పరుగులు పెడతారు. ముఖ్యంగా డాన్స్ విషయంలోనే మెగాస్టార్ కి కొన్ని కోట్లలో అభిమానులున్నారంటే మారు మాట్లాడకుండా ఒప్పుకోవాల్సిందే. ఆయన ఒక స్టెప్ వేశారంటే అది ఒక సిగ్నేచర్ స్టెప్ లా పర్మెనెంట్‌గా ఉండిపోవాల్సిందే. ఇక దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ  ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. 15 ఏళ్ల క్రితం అదో సిగ్నేచర్ మూవ్ మెంట్. 'ఇంద్ర' సినిమాలోని ఈ పాట అంతటా మార్మోగేది. బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల్లో యంగ్ ట్యాలెంట్ ఈ పాటకు స్టెప్పులేసేందుకు ఆసక్తిని కనబరిచేవారు. ఈ మూవ్ మెంట్ గురించి.. ఆ పాట గురించి తెలియని అభిమాని ఉండడు. 

 

అప్పట్లో ఈ సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్. అయితే సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఈ స్టెప్ ను మళ్లీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రీక్రియేట్ చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం సల్మాన్.. ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్-3లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఓ పాట కోసం వీణ స్టెప్ ను ప్రభుదేవా సలహా మేరకు కండల వీరుడు రీక్రియేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా సమాచారం. ప్రభుదేవా ఐడియాను సల్మాన్ ఎంతగానో ఇష్టపడి రీక్రియేట్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడట.  మరి ఆ స్టెప్ లో  చిరు చూపించినంత గ్రేస్ సల్మాన్ భాయ్ చూపిస్తాడో లేదో? చూడాలి. అయితే ఈ విషయం లో మెగా ఫ్యాన్స్ కి మాత్రం కాస్త అనుమానంగానే ఉన్నారు. మెగాస్టార్ లా సల్మాన్ చేస్తాడా అని.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీతో సల్మాన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరంజీవి- రామ్ చరణ్ లను కలుస్తుంటాడు. చిరంజీవితో ఉన్న స్నేహం కారణంగానే రామ్ చరణ్ మంచి స్నేహితుడయ్యాడు. మరి చిరు సిగ్నేచర్ స్టెప్ ని సల్మాన్  రీక్రియేట్ చేస్తున్నాడు అన్న విషయం మెగాస్టార్ కి తెలిస్తే ఆయనకంటే ఎక్కువగా సంతోషించేవాళ్లు ఎవరుంటారు. ఇక దబాంగ్ -3 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా... హిందీ- తెలుగు- తమిళ భాషల్లో సినిమా ఒకేసారి విడుదల కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: