టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న తాజా సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఇటీవల పలు వివాదాస్పద అంశాలపై సినిమాలు తీసి వాటి ద్వారా పలు విమర్శలు ఎదుర్కొన్న వర్మ, ఈ సినిమా ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలతో పాటు ఆ పార్టీ అధినేతలను టార్గెట్ చేసినట్లు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా వర్మ ఒకింత ఎక్కువగా టిడిపి అధినేత చంద్రబాబును మరియు ఆయన తనయుడు లోకేష్ ను మరింత టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతుంది. 

 

ఇకపోతే ఈ సినిమా పై ఇప్పటికే ఒక కేసు సెన్సార్ బోర్డు లో దాఖలవగా, మరొకరు ఈ సినిమాను ఆపేయాలని కేసు పెట్టాడం జరిగింది. ఇక సాధారణ ప్రజల్లో కొందరు కూడా ఈ సినిమా టైటిల్ పై అభ్యంతం చెప్తున్నారు. సినిమా టైటిల్ చూస్తుంటే, వర్మ గారు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అగ్ర కులాల మధ్య చిచ్చుపెట్టాలని భావిస్తున్నట్లు అర్ధం అవుతుందని, కాబట్టి ఈ సినిమా వివాదాస్పదమైన టైటిల్ ని మార్చాలని కోరుతున్నారు. ఇక నేడు ఈ సినిమా విషయమై రామ్ గోపాల్ వర్మ మీడియా వారితో మాట్లాడుతూ, తాను ఈ సినిమా ద్వారా ఎవరినీ కించపరచడం లేదని, 

 

అలానే ఈ సినిమాని రాష్ట్రంలోని ఇద్దరు ప్రధాన వ్యక్తులైన తండ్రి, కొడుకులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇక టైటిల్ విషయమై వస్తున్న అభ్యంతరాలు తనకు తెలుసునని, ఒకవేళ సెన్సార్ వారు సినిమా టైటిల్ మార్చమని చెపితే మార్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందుకే ఒకవేళ టైటిల్ మార్చవలసి వస్తే సినిమాకు 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' గా మార్చడానికి తమ సినిమా యూనిట్ సిద్ధం అని తెలిపారు. మరి ట్రైలర్ తోనే పలు వివాదాలకు తెరతీసిన వర్మ, రేపు ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: