గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. ఇక్కడ టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. అవసరానికి తగినట్టుగా స్కిన్ షోతో కూడా ఆడియెన్స్ ను మెప్పించాల్సి ఉంటుంది. అయితే ఐదారేళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదట్లో ఫ్లాపులు తెచ్చుకుని ప్రస్తుతం స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఓ హీరోయిన్ స్టైలిష్ మెన్ కు ఇచ్చిన వార్నింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 

సినిమాల్లో గ్లామర్ గా కనిపించడం వేరు.. సినిమా ప్రమోషన్స్ లో గ్లామర్ గా కనిపించడం వేరు. ఇదే విషయాన్ని ఆ హీరోయిన్ స్టైలిస్ట్ చెప్పాడట. అయితే నీ పని నువ్వు చూసుకో నాకు సలహాలు ఇవ్వకు. నాకే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిందట. ఇదంతా ఓ ఈవెంట్ జరుగుతున్న టైంలో నడిచిందట.  

 

అప్పుడు అర్ధమైందట అతగాడికి.. సినిమాలు చేసి టాలెంట్ నిరూపించుకుంటున్నా సరే ఆ హీరోయిన్ కు ఛాన్సులు ఎందుకు రావట్లేదో ఇప్పుడు అతని అర్ధమైందట. రోజుకో హీరోయిన్ వస్తున్న ఈ టైంలో కథానాయికలు తమకు వచ్చిన ఈ ఐడెంటిటీని పెంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాని ఇలా సలహా ఇచ్చిన వాడిని అరవకూడదు.

 

సదరు హీరోయిన్ సినిమాల్లో ఓ మోస్తారుగా గ్లామర్ షో చేస్తుంది.. ప్రమోషన్స్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా ఉండదు. అందుకే ఇక మీదట సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా హీరోయిన్ సెక్సీ అప్పీల్ ఇచ్చేలా ప్రయత్నించాలని చూస్తుంది. స్టైలిస్ట్ తో గొడవైనా సరే అతని చెప్పిన మాటల్లో విషయాన్ని హీరోయిన్ గ్రహించిందని తెలుస్తుంది.  ఇక మీదట అయినా ఆ హీరోయిన్ ప్రమోషన్స్ కు బయట ఈవెంట్స్ కు సెక్సీ లుక్ తో ఆడియెన్స్ ను అలరించేలా చేస్తుందో లేదో చూడాలి. ఓ పక్క మిగతా హీరోయిన్స్ ఇదే పంథా ఫాలో అవుతుంటే వారికి ఎంచక్కా అవకాశాలు వస్తున్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: